భారత హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) కమ్యూనికేషన్ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పురుషులతోపాటు మహిళా అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులకు పదోతరగతితోపాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ లేదా ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించి మే 14 నుంచి జూన్ 12 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీల సంఖ్య: 1312
1) హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 982 పోస్టులు
2) హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 330 పోస్టులు
అర్హత:
పదో తరగతి, ఇంటర్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్), ఐటీఐ (రేడియో & టెలివిజన్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్, డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, జనరల్ ఎలక్ట్రానిక్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ మెయింటెనెన్స్, కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్ మెయింటెనెన్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, నెట్‌వర్క్ టెక్నీషియన్, మెకాట్రోనిక్స్).
వయోపరిమితి: 19.09.2022 నాటికి 18 - 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: స్క్రీనింగ్ పరీక్ష, పీఎస్‌టీ/ పీఈటీ, డాక్యుమెంటేషన్, డిస్క్రిప్టివ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.
జీతం: రూ.25,500- రూ.81,100.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.08.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.09.2022.
Related Article:
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ తెలిసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మూడుదశల్లో ఉద్యోగ ఎంపికలు చేపడతారు. మొదటి దశలో రాతపరీక్ష; రెండో దశలో ఫిజికల్ మెజర్‌మెంట్, స్టెనోగ్రఫీ (ఏఎస్‌ఐ)/టైపింగ్(హెడ్ కానిస్టేబుల్), మెడికల్ టెస్ట్ ఆధారంగా ప్రతిభ కనబరచిన అభ్యర్థులతో మెరిట్ జాబితాను సిద్ధంచేసి ఉద్యోగ నియామకాలు చేపడతారు.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 323
1) అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్): 11 పోస్టులు
2) హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్): 312 పోస్టులు
పోస్టుల కేటాయింపు:
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనోగ్రాఫర్) పోస్టులను పూర్తిగా ఎస్టీ సామాజిక వర్గానికే కేటాయించారు. ఇక హెడ్ కానిస్టేబుల్ పోస్టులను జనరల్-154, ఈడబ్ల్యూఎస్-41, ఓబీసీ-65, ఎస్సీ-38, ఎస్టీ-14 పోస్టులు కేటాయించారు.
అర్హత:
ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్(10+2), ఇంగ్లిష్/ హిందీ షార్ట్ హ్యాండ్, టైపింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు 40 సంవత్సరాల వయసు దాకా (ఎస్టీ, ఎస్టీకు 45 సంవత్సరాలు), ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు జనరల్ అయితే 3 సంవత్సరాలు, ఓబీసీ అయితే 6 సంవత్సరాలు, ఎస్సీ-ఎస్టీలు అయితే 8 సంవత్సరాల వరకు వయోసడలింపు కల్పించారు. అదేవిధంగా ఒంటరి అవివాహిత వితంతు మహిళలకు 35 (జనరల్), 38 (ఓబీసీ), 40 (ఎస్సీ, ఎస్టీ) సంవత్సరాల వయసు వరకు వయోసడలింపుకు అవకాశం కల్పించారు.
జీత భత్యాలు:
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నెలకు రూ.29,200 - రూ.92,300, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నెలకు రూ.25,500 - రూ.81,100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్ మెంట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.
రాతపరీక్ష విధానం:
✪ మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
✪ వీటిలో విభాగం-1: హిందీ/ఇంగ్లిష్-20 మార్కులు,
విభాగం-2: జనరల్ ఇంటెలిజెన్స్ - 20 మార్కులు,
విభాగం-3: న్యూమరికల్ ఆప్టిట్యూడ్- 20 మార్కులు,
విభాగం-4: క్లరికల్ ఆప్టిట్యూడ్-20 మార్కులు,
విభాగం-5: బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్-20 మార్కులు ఉంటాయి.
✪ ఆబ్జెక్టివ్ విధానంలోనే మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు ఓంఎఆర్ షీట్‌లో జవాబులు గుర్తించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
✪ పరీక్షలో కనీస అర్హత మార్కులను ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 33 శాతంగా, ఇతరులకు 35 శాతంగా నిర్ణయించారు.
ముఖ్యమైన తేదీలు..
✪ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08.08.2022.
✪ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.09.2022.