విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు నిర్దేశించిన 'జగనన్న విదేశీ విద్యాదీవెన' రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రాంభమైంది. ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి.



ఈ పథకం కింద ప్రపంచంలో టాప్‌ 200లోపు క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపువారు జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఆర్థిక సాయం ఇలా..
100లోపు ర్యాంకున్న యూనివర్సిటీలకు పూర్తిగా ఉచితం, 101 నుంచి 200 ర్యాంకుగల యూనివర్సిటీలలో రూ.50 లక్షల ఫీజు గానీ, ఆ యూనివర్సిటీ ఫీజులో 50 శాతం గాని ఏది తక్కువైతే ఆ ఫీజును చెల్లించనున్నారు.




రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి..




అర్హతలు:
డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో 60% మార్కులు లేదా తత్సమాన గ్రేడును కలిగి ఉండాలని, ఎంబీబీఎస్ కోర్సులకు నీట్ పరీక్షలో అర్హత తప్పనిసరి అని ఒక ప్రకటనలో వెల్లడించింది. వార్షికాదాయం రూ.8 లక్షల లోపు, వయసు 35 ఏళ్లకు మించరాదని పేర్కొంది. ఆసక్తి గల విద్యార్థులు వెబ్‌సైట్‌ ద్వారా సెప్టెంబర్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.




Read Also: పేద విద్యార్థుల జీవితాల్లో ‘పరివర్తనం’ - హెచ్‌డీఎఫ్‌సీ పరివర్తన్‌ స్కాలర్‌షిప్‌






 




జగనన్న విదేశీ విద్యాదీవెన మార్గదర్శకాలు ఇవే..



  • ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ ఈ పథకం వర్తిస్తుంది. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంటుంది. 


  • 100పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించనుంది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌ జమ చేస్తారు. ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లిస్తారు. ఫస్ట్‌సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు ఉంటుంది. రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు, నాలుగో సెమిస్టర్‌ లేదా ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు చేస్తారు.


  • పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాదివారీగా లేదా సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యేంత వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుంది. టాప్‌ 200 యూనివర్శిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అందరికీ జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.




Read Also: పేద విద్యార్థులకు 'ఉపకారం' - పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేశారా?




ఇతర అర్హతలు:


* 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా గుర్తిస్తారు.

* ఏపీలో స్థానికుడై ఉండాలి. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు.

* ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్‌

* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీతో ఎంపిక.


 


జగనన్న విదేశీ విద్యాదీవెన గైడ్‌లైన్స్



జగనన్న విద్యాదీవెన జీవో


జగనన్న విద్యాదీవెన అర్హత యూనివర్సిటీలు


 


Also Read:
బీసీ విద్యార్థులకు గుడ్‌న్యూస్, పీఎం యశస్వీ స్కాలర్‌షిప్:
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పాఠశాల విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా ఆసరా  ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. యంగ్ అచీవర్స్ స్కాలర్‌షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (YASASVI) ప్రవేశ పరీక్ష-2022 నిర్వహణకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత ఉన్న పాఠశాల విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  యశస్వి అనేది ఇతర వెనుకబడిన తరగతి (ఓబీసీ), ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), డీ-నోటిఫైడ్, నోమాడిక్ & సెమీ నోమాడిక్ ట్రైబ్స్ (డీఎన్‌టీ/ ఎస్ఎన్‌టీ) వర్గాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన స్కాలర్‌షిప్ పథకం. 
అర్హతలు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..



Also Read:
మైనార్టీ’ ఉపకార వేతనాలకు దరఖాస్తులు:
తెలంగాణలో మైనార్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్ ఉపకార వేతనాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రీమెట్రిక్ విద్యార్థులు సెప్టెంబరు 30లోగా.. ఇంటర్, ఆ పైన చదివే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


మైనారిటీ విద్యార్థులు 2022-23 విద్యా సంవత్సరానికి నేషనల్ మైనార్టీస్ ఫ్రీ మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి), పోస్ట్ మెట్రిక్ విభాగంలో ఇంటర్మీడియట్ నుంచి పీహెచ్‌డీ గవర్నమెంట్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలు, ఐ.టి.ఐ లేదా ఐ.టి.సి టెక్నికల్ కోర్సులు, గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మైనారిటీ విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 


ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
-2008లో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ పథకం
-కేంద్రం 75 శాతం నిధులను సమకూరుస్తుంది.
-కేంద్రపాలిత ప్రాంతాలకు 100 శాతం నిధులను ఇస్తుంది.


పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ స్కీమ్
-2007లో ప్రారంభించారు.
-100 శాతం కేంద్రమే నిధులను సమకూరుస్తుంది.
-2007లో మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్‌ని ప్రారంభించారు. ఈ పథకం టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులను ఉద్దేశించింది.


Website


 


 


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..