తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా (Rashmika Mandanna) జంటగా నటిస్తున్న సినిమా 'వారసుడు' (Thalapathy Vijay's Varasudu Movie). తమిళంలో 'వారిసు' (Varisu) పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై 'దిల్' రాజు, శిరీష్.. పీవీపీ పతాకంపై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. వరుస షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న విజయ్ ఇప్పుడొక బ్రేక్ తీసుకున్నారు. ఈ బ్రేక్ లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన 'బింబిసార' సినిమాను చూసినట్లు తెలుస్తోంది.
హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమాను ఆగస్టు 15న సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్ ఏఎంబీలో విజయ్ చూశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మెడిలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో విజయ్ క్యాజువల్ డ్రెస్ లో మాస్క్ పెట్టుకొని కనిపించారు. విజయ్ ని గుర్తుపట్టిన ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పారు. విజయ్ కారులో వెళ్తుండగా.. అతడి డ్రైవర్ చేతులు అడ్డం పెడుతూ విజయ్ ని కవర్ చేసే ప్రయత్నం చేశారు.
ఇక ఈ సినిమాలో చాలా మంది పేరున్న నటీనటులను తీసుకున్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ నుంచి ప్రభు, శరత్ కుమార్ లాంటి సీనియర్ ఆర్టిస్ట్ లను రంగంలోకి దించారు. అలానే జయసుధ, ప్రకాష్ రాజ్ లను ఎంపిక చేసుకున్నట్లు కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు. వీరితో పాటు శ్రీకాంత్, సంగీత లాంటి నటులు కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు.
కోలీవుడ్ టాలెంటెడ్ కమెడియన్ యోగిబాబుని తీసుకున్నట్లు మొన్నామధ్య ప్రకటించారు. ఈ సినిమాలో విజయ్ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెబుతున్నారు. దళపతి 66వ చిత్రంగా రాబోతోన్న ఈ ప్రాజెక్ట్‌ను తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది 'బీస్ట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయారు. మరి ఈ సినిమాతోనైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి!