ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను రెండు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు కమిషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2023-24 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నిర్వహణ పనుల నిమిత్తం ఆగస్టు 18న రాత్రి 9 గంటల నుంచి ఆగస్టు 20న రాత్రి 9 గంటల వరకు వెబ్‌సైట్‌లో సేవలు ఉండవని స్పష్టం చేసింది. నియామక రాత పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను ముందే డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఏపీపీఎస్సీ వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షల హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. వీటిలో ఏపీ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విభాగంలో టౌన్‌ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టులకు,  ఏపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్, పబ్లిక్‌ హెల్త్‌ ల్యాబ్స్‌ అండ్‌ ఫుడ్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో శాంపిల్‌ టేకర్‌ పోస్టులకు, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన హాల్‌టికెట్లు అందుబాటులో ఉన్నాయి.


హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 


ప్రకటించిన షెడ్యూలు ప్రకారం..


➥ ఆగస్టు 18న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో టౌన్‌ప్లానింగ్‌ అండ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.


➥ ఆగస్టు 19 నుంచి 21 వరకు శాంపిల్‌ టేకర్‌ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లు ఆగస్టు 18 వరకు అందుబాటులో ఉండనున్నాయి. టెక్నికల్ కారణాల వల్ల ఆగస్టు 18 నుంచి 20 వరకు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌ సేవలు నిలిచిపోతాయని, ఆలోగా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.


➥ ఆగస్టు 21, 22 తేదీల్లో వివిధ ఇంజినీరింగ్‌ సర్వీసుల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్స్‌(ఏఈఈ) రాత పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. కంప్యూటర్‌ ఆధారిత విధానంలో ఆగస్టు 21న మధ్యాహ్నం, 22న ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఏఈఈ పరీక్ష నిర్వహించనున్నారు.


ALSO READ:


భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో 105 జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ ఖాళీలు
BARC JRF Notification: ముంబయిలోని భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్‌) జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో పీజీ డిగ్రీతోపాటు జూనియర్ రిసెర్చ్ కోసం అర్హత కల్పించే ఏదైనా పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 4న ప్రారంభంకాగా.. ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అకడమిక్ మార్కులు, జాతీయ స్థాయి అర్హత పరీక్షలో సాధించిన స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, ఖాళీల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇండియన్ నేవీలో 35 ఎస్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, అర్హతలివే!
ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ద్వారా ఎగ్జిక్యూటివ్(ఐటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్ ద్వారా ఎంపికచేసిన అభ్యర్థులకు ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్‌ఏ)లో జనవరి 2024 నుంచి స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సు ప్రారంభమవుతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు అవసరం
AFMS SSC Medical Officer Recruitment 2023: ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్‌) షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ఉద్యోగ ప్రకటన (షార్ట్ నోటిఫికేషన్)ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో పురుషులకు 585 పోస్టులు, మహిళలకు 65 పోస్టులు కేటాయించారు. ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ఫిజికల్, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్‌ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది.నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..