ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లాలో.. ఒప్పంద ప్రాతిపదికన ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆరోగ్యమిత్ర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మా-డీ, బీఎస్సీ ఎంఎల్‌టీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. అక్టోబర్ 30, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఈ అర్హతలున్నవారు నవంబర్ 17, 2022వ తేదిలోపు ఆఫ్‌లైన్ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
వివరాలు..
ఆరోగ్యమిత్ర: 06 పోస్టులు
అర్హత: బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మా-డీ, బీఎస్సీ ఎంఎల్‌టీ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.15000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 17.11.2022.
Also Read:
AP JCJ Notification: ఏపీలో సివిల్ జడ్జి పోస్టులు - అర్హతలు, ఎంపిక వివరాలు ఇలా!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి(జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 25 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా, మిగతా 6 పోస్టులు ట్రాన్స్‌ఫర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. లా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నవంబరు 17 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. డిసెంబరు 8 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలు, దరఖాస్తు ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దీనిద్వారా ఎనిమిది కంప్యూటర్ డ్రాట్స్‌మ్యాన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పదోతరగతితోపాటు ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 10న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 29లోగా నిర్ణీత దరఖాస్తు, పరీక్ష ఫీజు చెల్లించి నవంబరు 30 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, కంప్యూటర్ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..