CTET December Result 2021 Released: డిసెంబర్ నెలలో నిర్వహించిన సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET December Result 2021) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. సీటెట్ ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బుధవారం విడుదల చేయనుంది. ఏడు సంవత్సరాల వరకు సీటెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీ ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయ సంస్థలలో కొన్ని చోట్ల టీచర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు సీటెట్ సర్టిఫికెట్ అవసరం ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. వాస్తవానికి ఇప్పటివరకే సీటెట్ ఫలితాల్ని విడుదల చేయాల్సి ఉండగా, కరోనా వ్యాప్తి, అనివార్య కారణాలతో ఫలితాలు వాయిదా వేస్తూ వచ్చారు. 


ఫలితాలు విడుదల చేశాక రీ టెస్ట్ నిర్వహించడం మాత్రం జరగదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. సీటెట్ డిసెంబర్ సెషన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ctet.nic.inలో లో ఫలితాలు చూసుకోవాలని బోర్డ్ అధికారులు సూచించారు. గత ఏడాది డిసెంబర్ 16 నుంచి 21 తేదీల మధ్య 20 భాషలలో నిర్వహించారు. కీ పేపర్ ఈ జనవరి 31న బోర్డ్ విడుదల చేసింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించేందుకు ఫిబ్రవరి 4 వరకు డెడ్‌లైన్ ఇచ్చారు. అన్ని పరీశీలించిన తరువాత ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. 


వీటికి సంబంధించిన ఫలితాలు ప్రకటన తర్వాత మార్కుల షీట్లు, ధృవీకరణ సర్టిఫికేట్లు డీజీ లాకర్‌లో అందుబాటులో ఉంటాయి. సీటెట్ పేపర్ Iలో 150 మార్కులకు 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. అలాగే పేపర్-IIలో 150 మార్కులకు 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 300ల మార్కులకు ఈ పరీక్ష నిర్వహించబడుతుంది. కాగా గతంలో సీటెట్‌ పరీక్షలను ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించేవారు. అయితే సీటెట్‌ డిసెంబర్ 2021 పరీక్షలను మాత్రం తొలిసారిగా ఆన్‌లైన్ మోడ్ (CBT) లో జరిగాయి. ఫలితాలు వెల్లడించిన తర్వాత పునఃమూల్యాంకనానికి అవకాశం ఉండదు.
సీటెట్‌ డిసెంబర్ 2021 ఫలితాలను ఎలా చెక్‌ చెయ్యాలంటే..


సీటెట్ డిసెంబర్ 2021 ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ https://ctet.nic.in ఓపెన్‌ చెయ్యాలి.
హోం పేజీలో సీటెట్ డిసెంబర్ 2021 రిజల్ట్స్ కు సంబంధించిన లింక్ మీద క్లిక్ చేయాలి
అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి
మీ వివరాలు సరైనవి అయితే సీటెట్ డిసెంబర్ 2021 ఫలితాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. 
మీ రిజల్ట్స్‌ను భవిష్యత్ అవసరాల కోసం పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకుని ప్రింటౌ‌ట్ తీసి పెట్టుకోవడం బెటర్.