రాత్రి వేళ ఒంటరిగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక కాసేపటికి శవంగా మారడం హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు. రాత్రి 10 గంటలకు బయటికి బాలిక బయటకు వెళ్లిందని, అర్ధరాత్రి దాటాక 2.30 ఆమె శవాన్ని గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలివీ..
జీడిమెట్ల పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల సమీపంలోని సుభాష్ నగర్‌లో బచ్చన్ సింగ్, పూర్ణం కౌర్ దంపతులకు ఐదుగురు పిల్లలు ఉండగా.. వీరిలో నలుగురు కుమార్తెలు. ఒక కుమారుడు. వీరిలో పెద్ద కుమార్తెకు 17 ఏళ్లు. ఆరో తరగతి వరకు చదివి.. ఆపేసింది. ఇంటి వద్దనే ఉంటుంది. బచ్చన్ సింగ్ కుటుంబం నాలుగు నెలల క్రితం గాజులరామారంలో ఉండేది కాగా.. ఇటీవలే సుభాష్ నగర్‌కు మారారు.
ఇదిలా ఉండగా.. సోమవారం రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్న బాలిక ఒంటరిగా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అరగంట అయినా ఆమె ఇంకా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. అయినా ఆమె కనిపించలేదు. దీంతో రాత్రి ఒంటి గంటకు జీడిమెట్ల పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే పోలీసులు కిడ్నాప్‌గా కేసు నమోదు చేశారు.
తర్వాత రాత్రి 2.30 సమయంలో స్థానిక పైప్ లైన్ రోడ్డులోని ఓ భవనం వద్ద బాలిక శవం పడి ఉందని సమాచారం అందింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు బాలిక తల్లిదండ్రులను రమ్మని శవాన్ని చూపించారు. దీంతో ఆమె తమ కుమార్తెనే అని తల్లిదండ్రులు నిర్ధరించారు. ఆ బాలిక చున్నీ అదే భవనంలోని ఐదో అంతస్తులో దొరికింది. బాలిక తలపై బలమైన గాయం, నోట్లో నుంచి రక్తం వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో ఆత్మహత్య అని అనుమానించారు. బాలిక పోస్టుమార్టమ్ రిపోర్టులోనూ హత్య జరిగిందనే ఆనవాళ్లు దొరకలేదు.
ప్రేమికుల దినోత్సవం రోజే ఈమె ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. తన ఇంటికి దూరంగా ఉన్న అపార్ట్‌మెంట్ వద్దకు వచ్చినా.. చీకటిగా ఉండే 5వ అంతస్తుకు ఒంటరిగా ఎలా వెళ్లింది? వాచ్ మెన్ ఏం చేస్తున్నాడు? వెళ్లినా అపార్ట్‌మెంట్‌పైన పిట్టగోడ చాలా ఎత్తులో ఉంది. అది బాలిక అంత సులభంగా ఎలా ఎక్కగలదు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Khammam Crime: మామ గారితో కోడలు అఫైర్! పడకపై ఉండగా చూసిన కన్న కూతురు, చివరికి ఏమైందంటే