సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(ఏఎస్ఐ) స్టెనో పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సీఆర్‌పీఎఫ్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల అడ్మిట్‌కార్డులను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారు వెబ్‌సైట్‌లోని లాగిన్ పేజీలో తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏఎస్ఐ స్టెనో ఉద్యోగాల భర్తీకి మార్చి 27న కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహించనున్నారు.
హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..
Step 1: అడ్మిట్ కార్డుల కోసం అభ్యర్థులు మొదటి అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://crpf.gov.in/
Step 2: అక్కడ హోంపేజీలో కనిపించే 'CRPF ASI admit card' లింక్ మీద క్లిక్ చేయాలి.
Step 3: అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌కు సంబంధించి లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి
'LOGIN' బటన్ మీద క్లిక్ చేయాలి.
Step 4: CRPF ASI పరీక్ష హాల్‌టికెట్లు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
Step 5: హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ తరహాలోనే ప్రశ్నలు అడుగుతారు. హిందీ/ ఇంగ్లిష్-25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్-25 ప్రశ్నలు-25 మార్కులు, , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-25 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు.
తెలుగు రాష్ట్రాల్లో సీబీటీ పరీక్ష కేంద్రాలు: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుట్టపర్తి, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, సత్తుపల్లి, సూర్యాపేట, వరంగల్.
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) పోస్టులు, హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా మొత్తం 1458 పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 143 ఏఎస్‌ఐ, 1315 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇంటర్ అర్హత ఉన్న యువతీయువకుల నుంచి జనవరి 4 నుంచి 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. మార్చి 27న ఏఎస్‌ఐ పోస్టుల భర్తీకి రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏఎస్‌ఐ పోస్టులకు రూ.29,200 - రూ.92,300; హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు రూ.25,500-రూ.81,100 ఇస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
REC Recruitment: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 125 ఉద్యోగాలు, అర్హతలివే!
ఆర్ఈసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా మొత్తం 125 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్/ బీటెక్/ బీఈ/ డిప్లొమా/ సీఏ/ సీఎంఏ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ ఎంసీఏ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంబీఏ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
సీఆర్‌పీఎఫ్‌లో 9212 కానిస్టేబుల్ పోస్టులు, టెన్త్ అర్హతతో నెలకు రూ.69,100 వరకు జీతం!
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ విభాగాల్లో మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 424, తెలంగాణలో 301 ఖాళీలు ఉన్నాయి. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్న పురుష/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఏప్రిల్ 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..