Central Bank Recruitment: ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు జూన్ 27వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175. ఇతరులకు రూ.850 చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలు..
➥ సఫాయి కర్మచారి కమ్ సబ్-స్టాఫ్/ సబ్-స్టాఫ్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 484
జోన్/రీజియన్‌ల వారీగా ఖాళీలు..
➥ అహ్మదాబాద్(గుజరాత్): 76 పోస్టులు
రీజియన్: అహ్మదాబాద్- 12, బరోడా- 17, గాంధీనగర్- 21, జామ్‌నగర్-11, సూరత్- 15.
➥ భోపాల్(మధ్యప్రదేశ్): 24 పోస్టులు
రీజియన్: భోపాల్- 14, ఇండోర్- 10.
➥ భోపాల్(ఛత్తీస్‌గఢ్): 14 పోస్టులు
రీజియన్: రాయ్‌పూర్ - 14.
➥ ఢిల్లీ(ఢిల్లీ): 21 పోస్టులు
రీజియన్: ఢిల్లీ A(దక్షిణం)- 13, ఢిల్లీ B(నార్త్)- 08.
➥ ఢిల్లీ(రాజస్థాన్): 55 పోస్టులు
రీజియన్: జైపూర్- 15, కోటా- 20, జోధ్‌పూర్- 20.
➥ కోల్‌కతా(ఒరిస్సా): 02 పోస్టులు
రీజియన్: భువనేశ్వర్ - 02.
➥ లక్నో(ఉత్తర ప్రదేశ్): 78 పోస్టులు
రీజియన్: బరేలీ- 03, ఎత్వా- 09, డియోరియా- 10, గోరఖ్‌పూర్- 18, ఝాన్సీ- 07, కాన్పూర్- 07, లక్నో- 12, వారణాసీ- 12.
➥ ఎంఎంజడ్‌వో & పూణె(మహారాష్ట్ర): 118 పోస్టులు
రీజియన్: ముంబయి- 11, అమరావతి- 27, నాగ్‌పూర్- 18, అహ్మద్‌నగర్- 18, ఔరంగాబాద్- 13, నాసిక్- 16, పూణె- 15
➥ పట్నా(బీహార్): 76 పోస్టులు
రీజియన్: దర్భంగా- 07, మోతిహరి- 11, ముజఫర్‌పూర్- 11, సివాన్- 13, పాట్నా- 14, గయా- 10, పూర్ణె- 10.
➥ పట్నా(జార్ఖండ్): 20 పోస్టులు
రీజియన్: ధన్‌బాద్- 10, రాంచీ- 10.
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 31.03.2023 నాటికి 18 - 26 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175. ఇతరులు రూ.850 చెల్లించాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ఆన్‌లైన్ పరీక్ష-70 మార్కులు, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్-30 మార్కులు. ఆన్‌లైన్ పరీక్ష ఆంగ్ల మాధ్యమంలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్, ఎలిమెంటరీ అరిథ్‌మెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్(రీజనింగ్) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు.
పరీక్ష కేంద్రాలు: జోన్లవారీగా అహ్మదాబాద్, భోపాల్, ఢిల్లీ, కోల్‌కతా, లక్నో, ముంబయి మెట్రోపాలిటన్ జోనల్ ఆఫీస్), పూణె, పాట్నాలో పరీక్ష నిర్వహిస్తారు.
పే స్కేల్: నెలకు రూ.19,500 - రూ.37,815.
ముఖ్యమైన తేదీలు..
✦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తు ఫీజు ప్రారంభ తేదీ: 21.06.2024.
✦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 27.06.2024
✦ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: జులై 2024.
✦ ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్(PET): జులై 2024.
✦ ఆన్‌లైన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్: జులై/ ఆగస్టు 2024.
✦ ఆన్‌లైన్ పరీక్ష: జులై/ ఆగస్టు 2024.
✦ పరీక్ష ఫలితాల వెల్లడి: ఆగస్టు 2024.
✦ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: సెప్టెంబర్ 2024.
✦ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (జోన్ల వారీగా): సెప్టెంబర్ 2024.
✦ ప్రొవిజనల్ సెలెక్షన్: అక్టోబర్ 2024.
ALSO READ:
⪢ సెబీలో 97 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, ఎంపికైతే రూ.89 వేల వరకు జీతం
⪢ ఇండియన్ కోస్ట్‌గార్డులో 320 నావిక్, యాంత్రిక్ పోస్టులు