Farmer Loan Waiver: తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆగస్టులో రుణమాపీ చేయాలన్న టార్గెట్ పెట్టుకున్న ప్రభుత్వం ఆ దిశగా కార్యచరణ వేగవంతం చేసింది. ఓవైపు నిధుల సమీకరణ చేస్తూనే... మరోవైపు అర్హులను తేల్చే పనిలో పడింది. ఇప్పటికే దీనిపై అధికారులు ఓ కార్యచరణ సిద్ధం చేశారని తెలుస్తోంది. వీటిపై నిర్ణయం తీసుకునేందుకు  21 రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది. 


21న జరిగే తెలంగాణ మంత్రిమండలి భేటీలో ముఖ్య అంశంగా రుణమాఫీ  ఉంటుందని అంటున్నారు. ఈ విషయంపై సుదీర్ఘంగా చర్చించి కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఎవరెవరికి రుణమాఫీ చేయాలి, నిధుల సమీకరణకు ఏం చేయాలనే విషయంపై కూలంకుశంగా చర్చించనున్నారు. 


జులై17 రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. జులై నుంచే వ్యవసాయ పనులు ఊపందుకోనున్నాయని అప్పటి నుంచి రుణాలు మాఫీ చేస్తే రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారట. జులై మధ్యలో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి.. ఆగస్టు 15 కల్లా పూర్తి చేయనున్నారు. పీఎం కిసాన్‌ పథకంలో ఉన్న రూల్స్ ప్రకారమే మొత్తం మూడు విడతల్లో అప్పులు తీర్చేయనున్నారని టాక్. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ప్రజాప్రతినిధులు, ఐటీ కడుతున్న వాళ్లకు, ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించడం లేదు. ఇప్పుడు రుణమాఫీ కూడా వారి వచ్చే ఛాన్స్ లేదంటున్నారు.