పూణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 6లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

వివరాలు..

* మొత్తం ఖాళీలు: 100

➥ క్రెడిట్ ఆఫీసర్ (స్కేల్-II): 50 పోస్టులు 

➥ క్రెడిట్ ఆఫీసర్ (స్కేల్-III): 50 పోస్టులు

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ(ఫుల్‌టైం),బ్యాంకింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ & ఫైనాన్స్, మార్కెటింగ్, ఫారెక్స్, క్రెడిట్, పీజీడీబీఏ, పీజీడీబీఎం, సీఏ,సీఎఫ్‌ఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 30.09.2023 నాటికి క్రెడిట్ ఆఫీసర్(స్కేల్-II) పోస్టులకు 25-32 సంవత్సరాలు, క్రెడిట్ ఆఫీసర్(స్కేల్-III) పోస్టులకు 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1180. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.118 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

రాతపరీక్ష విధానం: మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ప్రొఫెషనల్ నాలెజ్డ్ నుంచి 50 ప్రశ్నలు-100 మార్కులు, జనరల్ బ్యాంకింగ్ నుంచి 50 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు.

పరీక్ష కేంద్రాలు: పాట్నా, ఛండీఘడ్, రాయ్‌పూర్, ఢిల్లీ ఎన్‌సీఆర్, పనాజీ, అహ్మదాబాద్, రాంచీ, భోపాల్, ఔరంగబాద్, ముంబయి, నాగ్‌పూర్, పుణె, జైపూర్, లక్నో, కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్, చెన్నై, హైదారాబాద్, బెంగళూరు, తిరువనంతపురం.

జీతభత్యాలు: క్రెడిట్ ఆఫీసర్(స్కేల్-II) పోస్టులకు రూ.48,170-రూ.69,810; క్రెడిట్ ఆఫీసర్(స్కేల్-III) పోస్టులకు రూ.63,840-రూ.78,230 చెల్లిస్తారు. 

ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 23.10.2023.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 06.11.2023.


Notification


Online Application


Website


ALSO READ:


నిమ్‌హాన్స్‌లో 161 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నర్సింగ్ విభాగంలో డిగ్రీతోపాటు తగిన అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 18 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీచేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1,180 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.885 చెల్లిస్తే సరిపోతుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటర్ అర్హతతో 436 ఎయిర్‌పోర్ట్ కొలువులు - ఎంపిక ఇలా!
న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఏఏఐసీఎల్‌ఏఎస్‌ కేంద్రాల్లో అసిస్టెంట్(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


శ్రీహరికోట-సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు, ఈ అర్హతలుండాలి
తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఎస్డీఎస్సీ షార్ సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్సీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు నవంబరు 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. నెలకు రూ.79,662 జీతంగా ఇస్తారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..