Bank of India Security Officers Notification: ముంబయిలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెడ్‌క్వార్టర్స్ సెక్యూరిటీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ కోర్స్‌ సర్టిఫికేట్‌ లేదా డిగ్రీలో ఐటీ లేదా సంబంధిత విభాగం ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. త్రివిధ దళాల్లో కమిషన్డ్  సర్వీసులో ఆఫీసర్ స్థాయిలో (లేదా) డీఎస్‌పీ స్థాయిలో (లేదా) పారామిలిటరీ ఫోర్సెస్‌లో అసిస్టెంట్ కమాండెంట్ స్థాయిలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.   ఈ పోస్టుల భర్తీకి మార్చి 20న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. అర్హతలు, పని అనుభవం, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.


పోస్టుల వివరాలు..


➥ సెక్యురిటీ ఆఫీసర్‌ పోస్టులు


ఖాళీల సంఖ్య: 15.


పోస్టుల కేటాయింపు: జనరల్-07, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-04, ఎస్టీ-01, ఎస్సీ-02.


అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ కోర్స్‌ సర్టిఫికేట్‌ లేదా డిగ్రీలో ఐటీ లేదా సంబంధిత విభాగం ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. 


అనుభవం: త్రివిధ దళాల్లో కమిషన్డ్  సర్వీసులో ఆఫీసర్ స్థాయిలో (లేదా) డీఎస్‌పీ స్థాయిలో (లేదా) పారామిలిటరీ ఫోర్సెస్‌లో అసిస్టెంట్ కమాండెంట్ స్థాయిలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.  


వయోపరిమితి: 01.02.2024 నాటికి 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 5 సంవత్సరాలకు , 1984 అల్లర్ల బాధితులకు 5 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.850. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: పని అనుభవం, గ్రూప్‌ డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.


జీతం: రూ.48,170 - రూ.69,810.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.03.2024.


➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 03.04.2024.


Notification


Website


ALSO READ:


సెబీలో 97 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తు ప్రక్రియ ఎప్పటినుంచంటే?
ముంబయిలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌  బోర్డు ఆఫ్‌ ఇండియా(సెబీ) వివిధ విభాగాల్లో ఆఫీసర్‌ గ్రేడ్‌-ఎ (అసిస్టెంట్‌ మేనేజర్‌) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 97 అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి..ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. సరైన అర్హతలున్నవారు  ఏప్రిల్‌ 13 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఫేజ్-1, ఫేజ్-2 ఆన్‌లైన్ పరీక్షలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తివివరాలు ఏప్రిల్ 13 నుంచి అందుబాటులో ఉంటాయి. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...