Pushpak Launched: స్వదేశీ స్పేస్ షటిల్‌గా (swadeshi space shuttle) పిలుచుకునే పుష్పక్ రాకెట్‌ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. SUV పరిమాణంలో ఉన్న ఈ రాకెట్‌ని కర్ణాటకలోని చిత్రదుర్గలో Aeronautical Test Range (ATR) వద్ద ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. లాంఛ్ చేసిన తరవాత ఈ రాకెట్‌ సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ అయింది. రీయూజబుల్ రాకెట్‌లు (Reusable Launch Vehicle) తయారు చేసుకోవడంలో భారత్ చరిత్రలో ఇదో మైలురాయి అని ఇస్రో చెబుతోంది. ఎయిర్‌ ఫోర్స్ హెలికాప్టర్ నుంచి ఈ రాకెట్‌ని పై నుంచి విడిచిపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. ఈ మేరకు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ అధికారికంగా వెల్లడించారు. 



"ఇస్రో మరో ఘనత సాధించింది. రీయూజబుల్ లాంఛింగ్ వెహికిల్ (RLV) టెక్నాలజీతో తయారు చేసిన పుష్పక్ రాకెట్‌ని విజయవంతంగా ప్రయోగించింది. పై నుంచి వదిలిన సమయంలో నిర్దేశించినట్టుగానే రన్‌వైపే సురక్షితంగా ల్యాండ్ అయింది. ఇండియర్ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ చినూక్‌ ద్వారా పైకి తీసుకెళ్లి గాల్లోకి వదిలిపెట్టాం. 4.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి వదిలి వేశాం. ఈ సమయంలో పుష్పక్ రాకెట్‌ రన్‌వే వైపు దూసుకొచ్చింది. రేంజ్‌ని కూడా తనకు తానుగానే సరి చేసుకుంది. ఆ తరవాత రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. బ్రేక్ పారాచూట్‌ సాయంతో ఆగిపోయింది."


- ఇస్రో 







ఏవైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు అంతరిక్షంలో నుంచి భూమిపైకి సురక్షితంగా ఈ రాకెట్‌ చేరుకునేలా ఈ రీయూజబుల్ రాకెట్‌ని తయారు చేశారు. ఈ సిరీస్‌లో ఇది మూడో రాకెట్. అయితే...వీటిని వినియోగించుకునేందుకు మరి కొన్ని సంవత్సరాల సమయం పట్టే అవకాశముందని ఇస్రో చెబుతోంది. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అంతరిక్షంలోకి పంపుతున్న రాకెట్‌లు సరైన విధంగా మళ్లీ భూమికి చేరుకోకపోతే ఆ ఖర్చంతా వృథా అయిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగానే ఈ పునర్వినియోగ రాకెట్‌లను తయారు చేస్తోంది ఇస్రో. అంతరిక్షంలో వ్యర్థాలు (Space Debris) తగ్గించేందుకూ ఇవి తోడ్పడనున్నాయి. ఈ సిరీస్‌లోని తొలి రాకెట్‌ని 2016లో ప్రయోగించారు. బే ఆఫ్ బెంగాల్‌ సమీపంలోని వర్చువల్‌ రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇక రెండోసారి 2023లో లాంఛ్ చేశారు. వీటికి Pushpak Vimanగా పేరు పెట్టారు. వీటిని తయారు చేసేందుకు ఇస్రోలో ప్రత్యేకంగా ఓ టీమ్ పని చేస్తోంది. పదేళ్లుగా ఇదే పనిలో ఉన్నారు. 6.5 మీటర్ల పొడవైన ఈ రాకెట్‌ బరువు 1.75 టన్నులు. ఈ ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది. 


 






Also Read: Delhi CM కేజ్రీవాల్ ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు, అరెస్ట్ చేస్తారేమోనని ఆప్ మంత్రుల ఆందోళన!