వారణాసిలోని ఇండియన్ రైల్వేకు చెందిన 'బెనారస్ లోకోమోటివ్ వర్క్స్(బీఎల్‌డబ్ల్యూ)' 2022-23 ఏడాదికి సంబంధించి 46వ బ్యాచ్ యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 374 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నాన్ ఐటీఐ అప్రెంటిస్‌కు పదోతరగతి, ఐటీఐ అప్రెంటిస్‌కు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో నవంబరు 25లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అకడమిక్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
వివరాలు..
* యాక్ట్ అప్రెంటిస్
ఖాళీల సంఖ్య: 374 పోస్టులు
1) ఐటీఐ అప్రెంటిస్: 300 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్ - 122, ఈబ్ల్యూఎస్ - 30, ఓబీసీ - 81, ఎస్టీ - 22, ఎస్సీ - 45.
ట్రేడ్లవారీగా ఖాళీలు..
➥ ఫిట్టర్ - 107
➥ కార్పెంటర్ - 03
➥ పెయింటర్ (జనరల్) - 07
➥ మెషినిస్ట్ - 67
➥ వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రికల్) - 45
➥ ఎలక్ట్రీషియన్ - 71
అర్హత: 50 శాతం మార్కులతో సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 25.11.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలవరకు వయోసడలింపు వర్తిస్తుంది.
2) నాన్ ఐటీఐ అప్రెంటిస్: 74 పోస్టులు
పోస్టుల కేటాయింపు: జనరల్ - 29, ఈబ్ల్యూఎస్ - 08, ఓబీసీ - 20, ఎస్టీ - 05, ఎస్సీ - 12.
ట్రేడ్లవారీగా ఖాళీలు..
➥ ఫిట్టర్ - 30
➥ మెషినిస్ట్ - 15
➥ వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రికల్) - 11
➥ ఎలక్ట్రీషియన్ - 18
అర్హత: 50 శాతం మార్కులతో పదోతరగతి అర్హత ఉండాలి.
వయోపరిమితి: 25.11.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలవరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.11.2023.
➥ ఆన్‌లైన్‌లో ధ్రువపత్రాల అప్‌లోడ్‌కు చివరితేది: 27.11.2023.
ALSO READ:
ఏపీఎస్‌ఆర్‌టీసీ- కర్నూలు జోన్‌లో 309 అప్రెంటిస్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), కర్నూలు పరిధిలో... వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణ కోసం ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనిద్వారా మొత్తం 309 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు నవంబర్ 15లోగా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్‌సైట్‌లో దరఖాస్తు నింపి, అవసరమైన సర్టిఫికేట్లు జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలోని ఐటీఐలలో చదివినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. అర్హులైన అభ్యర్థులకు నవంబరు 16న కర్నూలులోని ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ఉండాలి. అభ్యర్థులు వివరాల కోసం 08518-257025, 7382869399, 7382873146 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిదినాల్లో మాత్రమే సేవలు అందుబాటులో ఉంటాయి.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..