చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 5న ప్రారంభంకాగా.. నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి నవంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు..
➲ అసిస్టెంట్ మేనేజర్: 15 పోస్టులు
పోస్టుల కేటాయింపు: ఓసీ - 07, బీసీ - 05, ఎస్సీ - 01, ఎస్టీ - 01, ఎక్స్-సర్వీస్‌మెన్ - 01. మొత్తం పోస్టుల్లో మహిళలకు 3 పోస్టులు, పురుషులకు 12 పోస్టులు కేటాయించారు.
అర్హత: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో కామర్స్ డిగ్రీ అర్హత ఉండాలి. పీజీ (ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్)తోపాటు ఐఐబీఎఫ్ డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్
వయోపరిమితి: 01.10.2022 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; బీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ.590 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్ మెన్, దివ్యాంగులు రూ.413 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు-30 మార్కులు, రీజనింగ్ 35 ప్రశ్నలు-35 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 ప్రశ్నలు-35 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
జీత భత్యాలు: నెలకు రూ.26,080- రూ.57,860. ఇతర భత్యాలతో కలిపి ప్రారంభంలో నెలకు రూ.39,859 అందుతుంది.
ముఖ్యమైన తేదీలు..
➨ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.11.2022.
➨ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 20.11.2022.
➨ దరఖాస్తుల సవరణ, ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 20.11.2022.
➨ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేది: 05.12.2022.
➨ ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణ తేదీ: డిసెంబర్ 2022.
Also Read:
చిత్తూరు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో 40 క్లర్క్ పోస్టులు, అర్హతలివే!
చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ శాశ్వత ప్రాతిపదికన స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నవంబరు 5న ప్రారంభంకాగా.. నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి నవంబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
విజయవాడ ఏపీకోఆపరేటివ్ బ్యాంకులో ఖాళీలు, అర్హతలివే!
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ ప్రొఫెషనల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అకౌంటెన్సీ, బ్యాంకింగ్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీకి చేయనున్నారు. అకౌంటెన్సీ విభాగంలో ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బ్యాంకింగ్ విభాగంలో డిగ్రీ అర్హతతో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో పనిచేసి ఉండాలి. సంబంధిత విభాగాల్లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...