బీఎస్ఎన్ఎల్ రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను మనదేశంలో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్లాన్లు అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే ఖరీదైన ప్లాన్ ధర రూ.1,198 కాగా, చవకైన రెండో ప్లాన్ ధర రూ.439గా ఉంది. ఈ రెండు ప్లాన్ల లాభాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.


బీఎస్ఎన్ఎల్ రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. లాంగ్ టర్మ్ ప్లాన్లు కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. నెలకు 3 జీబీ డేటా, 300 నిమిషాల కాలింగ్, 30 ఎస్ఎంఎస్‌లు ఈ ప్లాన్ ద్వారా లభించనున్నాయి. ప్రతి నెల ప్రారంభంలో ఇవి మళ్లీ రెన్యూ అవుతాయి. ముందు నెల డేటా, కాలింగ్, ఎస్ఎంఎస్ లాభాలు మిగిలితే అవి వచ్చే నెలకు క్యారీ అవ్వవని కంపెనీ తెలిపింది.


బీఎస్ఎన్ఎల్ రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్
ఇది బీఎస్ఎన్ఎల్ లాంచ్ చేసిన కొత్త ప్లాన్. దీని వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. అన్‌లిమిడెట్ వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లను ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. అయితే ఈ ప్లాన్ ద్వారా డేటా మాత్రం కంపెనీ అందించడం లేదు.


బీఎస్ఎన్ఎల్ దగ్గర మిగతా నెట్‌వర్క్‌ల లేని ప్లాన్లు కూడా ఉన్నాయి. అదే రూ.398 ప్లాన్. బీఎస్ఎన్ఎల్ రూ.398 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ డేటాను అందించనుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. వొడాఫోన్ ఐడియా పోస్ట్ పెయిడ్‌లో రూ.699 ప్లాన్ ద్వారా ఇటువంటి లాభాలను అందించనుంది. కానీ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చాలా ధర తక్కువగా ఉంది.


బీఎస్ఎన్ఎల్ ఇటీవలే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే రూ.2,022 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందించనున్నారు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 300 రోజులుగా ఉంది. దీని ద్వారా 75 జీబీ డేటాను అందించనున్నారు. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ లాభాలు కూడా లభించనున్నాయి.