Alluri District News : అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీ పరిధిలో కొండ శిఖర గ్రామాలైన రెడ్డి, రాచికిలం, మడ్రేవు పాల బంధలో సుమారు 500 మంది ఆదివాసి గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రాచకిలo గ్రామంలో  తామర్ల రాజబాబు( 56), సుకురు రావులమ్మ (58) డోలు మోత ద్వారా మార్గ మధ్యలో వైద్యం అందక మరణించారు. మడ్రేబు గ్రామంలో  కొండతాంబిల్లి సొలమో (50), కొండతాంబెల్లి రాజులమ్మ గర్భిణీ సరైనా సమయానికి వైద్యం మరణించారు. ఈ విధంగా మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసి గిరిజనులలో ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు డోలీ మోతల్లో  మార్గ మధ్యలో  మరణిస్తున్నారని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న  ఆదివాసి గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అన్యాయమని ఆవేదన చెందుతున్నారు. 


డోలీలతో మహా పాదయాత్ర 


ఇప్పటికైనా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గిరిజన గ్రామాలు సందర్శించి మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజనులు కోరారు. అందుకోసం అడ్డాకులు ధరించి ఆదివాసీలు వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నిరసనలో పినకోట  పంచాయతీ వార్డు సభ్యులు కొర్ర జమ్ములు, సూకురు జమరాజు, మడ్రబు గ్రామానికి చెందిన కొండతాంబలి నర్సింగరావు, కొండతాంబలి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.  అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కొండ శిఖర గ్రామాల్లో సందర్శించాలని ఆదివాసీలు కోరారు. రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల ఆఖరులోగా రోడ్డు సమస్య పరిష్కారం చేయకపోతే  అడ్డాకులు ధరించి పాడేరు కలెక్టర్ కార్యాలయం వరకు డోలీ యాత్ర నిర్వహిస్తామని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. గోవిందరావు డిమాండ్ చేశారు. 


మన్యంలో డోలీ కష్టాలు 


పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చిన తోలుమండ గ్రామానికి చెందిన కొండగొర్రి కాసులమ్మ అనే గిరిజన మహిళకు ఇటీవల పురిటి నొప్పులు వచ్చాయి. చినతోలుమండ గ్రామం నుంచి డోలీ సాయంతో కొండ కిందికి దించారు. అక్కడి నుంచి ఫీడర్ అంబులెన్స్ లో సమీపంలోని రావాడ రామభద్రాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించడంతో పండంటి ఆడ శిశువుకి జన్మనిచ్చింది. సకాలంలో వైద్య సేవలు అందడం వలన తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు. చిన తొలిమండ గ్రామానికి రహదారి సదుపాయం లేకపోవడం వలన ఎవరికి ఏ జబ్బు చేసిన సరే వారికి డోలి మోతలే శరణ్యం. 


గర్భిణీ వసతి గృహాలు


ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ఆ గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాల్సిందిగా గ్రామస్తులు వేడుకుంటున్నారు. రానున్నది వర్షాకాలం ఆరోగ్య సమస్యలు ఏం వచ్చినా మాకు డోలీ మోతలే దిక్కు. ఒక పక్క డోలీ మోస్తూ ఇంకొకపక్క వర్షంలో తడుస్తూ మోసుకు వచ్చినప్పుడు పిడుగులు పడతాయని భయం, అధిక వర్షం కురిస్తే ఏంచేయాలనే భయం ఉంటాయని గిరిజనులు అంటున్నారు.  గతంలో అప్పటి పీవో డాక్టర్ లక్ష్మీష ఏర్పాటుచేసిన గర్భిణీ వసతి గృహానికి ఏడు నెలలు నిండిన గిరిజన గర్భిణీలను తరలించేవారు. అలాంటి వసతి గృహాలు ఏర్పాటు చేస్తే గిరిజనుల ప్రాణాలు కాపాడే వాళ్లవుతారని ప్రజలు కోరుతున్నారు.