విద్యుత్ సంస్థలో ఉద్యోగాల కోసం వేచి చూసే వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశాఖపట్నంలోని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APEPDCL) జూనియన్ లైన్‌మెన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు సెప్టెంబర్ 24వ తేదీతో ముగియనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో APEPDCL వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షను అక్టోబర్ 10న నిర్వహిస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. మరిన్ని వివరాల కోసం https://apeasternpower.com/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.
ముఖ్యమైన తేదీలివే..
దరఖాస్తుల సవరణలకు సెప్టెంబర్ 26 నుంచి 28వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ పోస్టులకు సంబంధించిన పరీక్ష అక్టోబర్ 10న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనుంది. హాల్ టికెట్ల డౌన్ లోడ్ ప్రక్రియ అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక పరీక్షల ప్రిలిమనరీ 'కీ'ని అక్టోబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. 'కీ'పై అభ్యంతరాలను అక్టోబర్ 10 నుంచి 13వ తేదీ వరకు పంపవచ్చు. పరీక్ష ఫలితాలను అక్టోబర్ 22వ తేదీన విడుదల చేయనున్నారు.
ఖాళీల వివరాలు..
మొత్తం పోస్టులు- 398 (జనరల్- 283, బ్యాక్‌లాగ్- 115)
రాజమహేంద్రవరం 122 (జనరల్- 75, బ్యాక్‌లాగ్- 47)
శ్రీకాకుళం 88 (జనరల్- 66, బ్యాక్‌లాగ్- 22)
విజయనగరం 74 (జనరల్- 47, బ్యాక్‌లాగ్- 27)
విశాఖపట్నం- 71 (జనరల్- 65, బ్యాక్‌లాగ్- 6)
ఏలూరు- 40 (జనరల్- 30, బ్యాక్‌లాగ్- 13)
విద్యార్హత, వయోపరిమితి..
ఎలక్ట్రికల్, వైరింగ్ విభాగంలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్ విభాగంలో రెండేళ్ల ఒకేషనల్ ఇంటర్మీడియెట్ కోర్సు చేసిన పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థుల వయసు 2021 జూలై 1 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. గతంలో పదో తరగతి మార్కుల ఆధారంగా అర్హులను ఎంపిక చేసేవారు. అయితే ఎంపిక విధానంలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఈసారి రాతపరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.