ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) గుడ్‌న్యూస్‌ అందించింది. కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 25,271 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. పదో తరగతి పాస్ అయిన వారు దీనికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. ఎంపికైన వారి వేతనం (పే లెవల్ 3 ప్రకారం) నెలకు రూ.21,700 నుంచి 69,100 వరకు చెల్లిస్తారని తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు గడువు ఈ రోజుతో (ఆగస్టు 31) ముగియనుంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సహస్త్ర సీమా బల్ (SSB), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) తదితర విభాగాల్లో కానిస్టేబుళ్ల నియామకానికి ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో పురుషులకు 22,424 పోస్టులు.. మహిళలకు 2847 పోస్టులున్నాయి. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

ఖాళీల వివరాలు..బీఎస్ఎఫ్ (BSF) - 7,545సీఐఎస్ఎఫ్ (CISF) - 8,464ఎస్ఎస్ బీ (SSB) - 3,806ఐటీబీపీ (ITBP) - 1,431ఏఆర్ (Rifleman in Assam Rifles) - 3,785ఎస్ఎస్ఎఫ్ (SSF) - 240మొత్తం పోస్టుల సంఖ్య - 25,271

పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ & రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ & జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లేదా హిందీ అని నాలుగు విభాగాలు ఉంటాయి. వీటిలో ఒక్కో విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంది. తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు. ముఖ్యమైన వివరాలు.. అర్హత: 10వ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌లో తెలిపింది. మిగతా వారు రూ.100 చెల్లించాలి. దరఖాస్తులకు ఆఖరు తేదీ: ఆగస్టు 31, 2021ఆన్‌లైన్ పేమెంట్‌కు చివరి తేదీ: సెప్టెంబర్ 2, 2021వయసు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ బేస్డ్ ఎగ్జామ్ (Computer Based Examination), ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్ట్ (Physical Efficiency Test)‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌ (Phusical Standard Test), మెడికల్‌ ఎగ్జామినేషన్ (Medical Examination), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంతెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్