ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో షాక్ తగిలింది. గ్రేడ్ 2 ఎక్స్ టెన్షన్ అధికారుల నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 నియామకాలు తాత్కలికంగా నిలిచిపోనున్నాయి.


రాష్ట్రంలో 560 గ్రేడ్-2 పోస్టుల నియామకాలకు ఇటీవల ప్రభుత్వం జీవో ఇచ్చింది. 38వేల మంది అంగన్ వాడీ టీచర్లు ఇటీవల రాత పరీక్షలు రాశారు. మౌఖిక పరీక్షలు నిర్వహించకుండానే కొందరిని సెలెక్ట్ చేస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని కొందరు అభ్యర్థులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సెప్టెంబర్ 29వ తేదీ గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.

Also Read:  APPSC: గ్రూప్-4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి!


ఈ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం 50 మార్కులకు పరీక్షలు నిర్వహించాలని శ్రవణ్ కుమార్ వాదించారు. వీటిలో 45 మార్కులకు రాత పరీక్ష, 5 మార్కులకు మౌఖిక పరీక్ష నిర్వహించాలన్నారు. అయితే రాత పరీక్ష నిర్వహించిన అధికారులు.. మౌఖిక పరీక్ష నిర్వహించకుండానే కొందరిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నారని, ఉద్యోగాల భర్తీల్లో అవకతవకలు జరిగాయని ఆయన కోర్టుకు తెలిపారు. 


రాత పరీక్షను సెప్టెంబర్ 18న అధికారులు నిర్వహించారని, మౌఖిక పరీక్ష నిర్వహించకుండానే కొందరిని నియమించేందుకు చర్యలు చేపడుతున్నారని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. భర్తీల్లో అవకతవకలు జరిగాయని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. దీంతో ఎక్స్ టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 నియామకాల ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం.

Also Read:  APPSC MO Recruitment: ఏపీలో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!


ఇలా ఉండగా.. రెండు రోజుల క్రితం మహిళ, శిశు సంక్షేమ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించి.. అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30వ తేదీ లోపు అంగన్వాడీ కేంద్రాల సూపర్‌ వైజర్ల పోస్టుల భర్తీ చేస్తామని సీఏం సమీక్షా సమావేశంలో వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అత్యంత పారదర్శకంగా పరీక్షల ప్రక్రియ నిర్వహిస్తున్నామని అధికారులు కూడా తెలిపారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలను వెల్లడిస్తామని తెలిపారు. అయితే నియామకాల ప్రక్రియను పూర్తిచేయడానికి సీఏం విధించిన గడువుకు ఒక రోజు ముందు ఈ నియామకాల ప్రక్రియను తాత్కలికంగా నిలిపివేయాలని హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీచేసింది.


 


Also Read:


APPSC Non-Gazetted Recruitment: ఏపీలో 45 నాన్-గెజిటెడ్ పోస్టులు, అర్హతలివే!
ఏపీ ప్రభుత్వ విభాగాల్లో నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. అక్టోబరు 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..



APPSC: ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఈ అర్హతలు ఉండాలి!

ఏపీలోని ఆయుష్ విభాగంలో హోమియోపతి, ఆయుర్వేద లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెప్టెంబరు 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ అందుబాటులో ఉంచింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...