ప్రభాస్(Prabhas) పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ  ఆయన స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరులో నిర్వహించారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు  ప్రభాస్ కుటుంబ సభ్యులతో కలసి మొగల్తూరు వచ్చారు. దశాబ్దకాలం తర్వాత తమ అభిమాన హీరో ఇక్కడికి రావడంతో ఈ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.  


ప్రభాస్ ఇంటి వద్దకు భారీగా చేరుకొన్న అభిమానులు ప్రభాస్ కు జై కొట్టారు. రెబల్ స్టార్.. రెబల్ స్టార్ అంటూ నినాదాలతో ఆ ప్రాంగణం అంతా హోరెత్తింది. అదేవిధంగా మొగల్తూరు పట్టణంలో బైక్ ర్యాలీ చేశారు. 2012 లో తన తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన తరువాత  సంతాప కార్యక్రమాల కోసం  మొగల్తూరులో వారం రోజులు గడిపిన ప్రభాస్ మళ్లీ ఇన్నేళ్లకు మొగల్తూరు వచ్చారు.


రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభకు విచ్చేస్తున్న వారికోసం సుమారు లక్ష మందికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయించారు ప్రభాస్. బంధువులకు,  అభిమానులకు, గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా పోలీసు అధికారుల సహకారంతో అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక లక్ష మందికి 25 రకాల వంటకాలతో భోజన వసతిని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫుడ్ మెన్యూ, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


6 టన్నుల మటన్ కర్రీ, 6 టన్నుల బిర్యానీ మటన్, 1 టన్ను రొయ్యల గోంగూర ఇగురు, 1 టన్ను రొయ్యల ఇగురు,1 టన్ను స్టఫ్డ్ క్రాబ్, 1 టన్ను బొమ్మిడాయల పులుసు , 6 టన్నుల చికెన్ కర్రీ, 4 టన్నుల చికెన్ ఫ్రై, 6 టన్నుల చికెన్ బిర్యానీ, 1 టన్ను పండుగప్ప కర్రీ, 4 టన్నుల సందువా ఫిష్ ఫ్రై, 2 టన్నుల చిట్టి చేపల పులుసు, ఇవి కాక  మొత్తం 22 రకాల నాన్ వెజ్ వంటకాలు. 2 లక్షల బూరెలు, ఇంకా వెజ్ వంటకాలు ఇవి కృష్ణంరాజు సంస్మరణ సభలో వచ్చిన అతిధులకు వడ్డించిన ఆహారం. ఈ వంటకాల కోసం ప్రభాస్ రూ.4 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో కృష్ణంరాజు అంతిమ సంస్కారాలకు సంబంధించి తరలివచ్చిన అభిమానులకు కూడా ప్రభాస్ అంత వేదనలో ఉండి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం తెలిసిందే.