ఏపీలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉద్యోగ మేళాలు నిర్వహించడానికి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తుంది. నవంబరు 15, నవంబరు 18 తేదీల్లో జాబ్ ఫెయిర్ నిర్వహించనుంది. నవంబరు 14, 17 తేదీల్లోగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబరు 15న అన్నమయ్య జిల్లా రాయచోటిలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. అలాగే నంబరు 18న బాపట్ల జిల్లా ఖాజీపాలెంలో, పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగిలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇక విజయవాడలోనూ నవంబరు 18న జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, పీజీ, ఇతర విద్యార్హతలున్నవారు కూడా జాబ్‌మేళాకు హాజరుకావచ్చు.
జాబ్ మేళాకు వస్తున్న సంస్థలివే...
🔰రాయచోటిలో జరిగే జాబ్ ఫెయిర్‌కు మెడి అసిస్ట్, కియా మోటార్స్, జస్ట్ డయల్, బైజస్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు హాజరుకానున్నాయి.
🔰 బాపట్లలో జరిగే జాబ్ ఫెయిర్‌కు ముత్తూట్ ఫైనాన్స్, టాటా ప్లే, అపోలో ఫార్మసీ, ఫ్లక్స్‌టెక్ సొల్యూషన్స్, మాల్‌టెక్ సొల్యూషన్స్ ప్రవేట్ లిమిటెడ్ సంస్థలు హాజరుకానున్నాయి.
🔰 పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగే జాబ్ ఫెయిర్‌కు కాల్బే హెచ్‌ఆర్, కోల్గెట్ పామోలివ్ ఇండియా లిమిటెడ్, డిక్సన్ టెక్నాలజీస్(ఇండియా) లిమిటెడ్, ప్రీమియర్ హెల్త్ కేర్ సర్వీసెస్, బీ న్యూ మొబైల్స్ ప్రవేట్ లిమిటెడ్, మోహన్ స్పిన్‌టెక్స్ ఇండియా లిమిటెడ్, రెయిన్ బో జాబ్ సొల్యూషన్స్, హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, ఎస్‌బీఐ, అపోలో ఫార్మసీ, ఐసన్ ఎక్స్‌పీరియన్సెస్, డెక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రేడియంట్ ఎలక్ట్రానిక్స్ & అప్లికేషన్ లిమిటెడ్.
🔰విజయవాడలో వన్‌టౌన్‌లోని కేబీఎన్ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. పలు సంస్థలు హాజరుకానున్నాయి.
అన్నమయ్య జిల్లా మెగా జాబ్ ఫెయిర్ వివరాల కోసం క్లిక్ చేయండి..
బాపట్ల జిల్లా మెగా జాబ్ ఫెయిర్ వివరాల కోసం క్లిక్ చేయండి..
పార్వతీపురం మన్యం జిల్లా మెగా జాబ్ ఫెయిర్ వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
ECIL Walkin: ఈసీఐఎల్‌లో 70 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు! వాక్‌ఇన్ షెడ్యూలు ఇదే!
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది. బీఈ, బీటెక్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబరు 13, 14 తేదీల్లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. అర్హతలు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిచేస్తారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్ క్యాంపస్‌లో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు.
వివరాలు...
* టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 70
కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది. అవసరాలకు అనుగుణంగా పొడిగించే అవకాశం ఉంది.
అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్(ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & టెలి-కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: డిజిటల్ ఆసిలోస్కోప్ ఆపరేషన్, ఎలక్ట్రానిక్స్ మెజరింగ్ అండ్ టెస్టింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, డాక్యుమెంటేషన్ అండ్ రిపోర్ట్ రికార్డింగ్ విభాగాల్లో కనీసం ఏడాది పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 31.10.2022 నాటికి 30 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. వాక్‌ఇన్ తేదీరోజు ఉదయం 11.30 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
పని ప్రదేశం: ఎంపికైనవారు హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో పనిచేయాల్సి ఉంటుంది..
జీతభత్యాలు: నెలకు రూ.25000 చెల్లిస్తారు.
వాక్‌ఇన్ తేది: నవంబరు 13, 14 తేదీల్లో.
వాక్‌ఇన్ సమయం: ఉదయం 9:30 నుంచి.
వాక్‌ఇన్ వేదిక:
Factory Main Gate,
Electronics Corporation of India Limited,
ECIL Post, Hyderabad -500062.