ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ చాలా ఎంటర్ టైనింగ్ గా జరిగింది. సూపర్-12 స్టేజ్ కు వచ్చిన ప్రతి జట్టూ మంచి పోరాటాలను కనబర్చింది. అఫ్గానిస్థాన్ తప్ప మిగతా జట్లన్నీ కనీసం ఒక్క విజయాన్నైనా నమోదు చేసుకున్నాయి. అఫ్గాన్ కు వర్షం వల్ల కలిసి రాలేదు. అది పక్కన పెడితే ఈ వరల్డ్ కప్ లో నిరాశపర్చిన ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. ఆ రకంగా వరల్డ్ కప్ లో వరస్ట్ జట్టు ఏంటో అందులో ఎవరు చోటు దక్కించుకుంటారో చూద్దాం.


1. రోహిత్ శర్మ ( కెప్టెన్ )
స్టార్ ప్లేయర్, టీమిండియా కెప్టెన్. కానీ ఈ వరల్డ్ కప్ లో అస్సలు స్థాయికి తగ్గట్టు ఆడలేదు. టీమిండియాకు ఈ టోర్నమెంట్ లో అతిపెద్ద నెగిటివ్ మన ఓపెనింగే. అందులో రోహిత్ ప్రదర్శన చాలా నిరాశపర్చింది. 6 మ్యాచెస్ లో 116 రన్స్, కేవలం 106 స్ట్రైక్ రేట్. అస్సలు యాక్సెప్ట్ చేయలేని నంబర్స్ ఇవి. 


2. డేవిడ్ వార్నర్
మరో స్టార్ ప్లేయర్. టోర్నమెంట్ ముందువరకు వార్నర్ మీద ఆసీస్ కు చాలా అంచనాలు ఉండేవి. కానీ వార్నర్ కంప్లీట్ గా విఫలమయ్యాడు. గతేడాది ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచి, ఈసారి 4 ఇన్నింగ్స్ లో కేవలం 44 రన్స్ మాత్రమే చేశాడు. దారుణమైన ఫెయిల్యూర్ అన్నమాట


3. టెంబా బవుమా
ఈ టోర్నమెంట్ లో చాలా జట్లలోని ఓపెనర్లు విఫలమయ్యారు. అందులో టెంబా బవుమా ఒకడు. మనం చెప్పుకుంటున్న ఈ వరస్ట్ టీంలో మాత్రం నంబర్ 3లో వస్తాడు. టోర్నీలో కేవలం 70 పరుగులు మాత్రమే చేశాడు. 


4. ట్రిస్టన్ స్టబ్స్
టోర్నమెంట్ ముందు వరకు అనేక టీ20 లీగ్స్ లో స్టబ్స్ హిట్టింగ్ చూసి టాలెంటెడ్ యంగ్ స్టర్ అనుకున్నారు. కానీ ఈ టోర్నమెంట్ లో నిరాశపర్చాడు. 3 ఇన్నింగ్స్ లో 31 మాత్రమే స్కోర్ చేశాడు. కానీ కెరీర్ స్టార్టింగ్ లోనే ఉన్నాడు కాబట్టి తప్పులు సరిదిద్దుకునే అవకాశముంది.


5. టిమ్ డేవిడ్
ఆస్ట్రేలియన్ మిడిల్ ఆర్డర్ లో అందరూ భయపడాల్సిన వ్యక్తి టిమ్ డేవిడే అని టోర్నమెంట్ ముందు అందరూ చెప్పుకున్న మాట. కానీ తన హైప్ ను డేవిడ్ అందుకోలేకపోయాడు. 3 ఇన్నింగ్స్ లో 26 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. 


6. నికోలస్ పూరన్ (వికెట్ కీపర్)
రెండుసార్లు వరల్డ్ కప్ ఛాంపియన్ వెస్టిండీస్ సూపర్-12 కి రాకుండానే ఇంటిబాట పట్టింది. కెప్టెన్ గా, బ్యాటర్ గా నికోలస్ పూరన్ పూర్తిగా విఫలం. గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ లో రెండింట్లోనూ 4, 7 పరుగులు చేశాడు. బ్యాటర్ గా ఫెయిల్. టీంను సూపర్-12కి అయినా తీసుకురాలేక కెప్టెన్ గా కూడా ఫెయిల్. 


7. మహ్మద్ నబీ 
ఈ అఫ్గాన్ క్రికెటర్ కు ఇది కచ్చితంగా మర్చిపోవాల్సిన టోర్నమెంట్. కెప్టెన్ గా, ఆల్ రౌండర్ గా విఫలమయ్యాడు. టోర్నీ అయ్యాక కెప్టెన్సీ కూడా వదిలేశాడు. టోర్నమెంట్ లో కేవలం ఒక్క వికెట్టే తీశాడు. బ్యాటింగ్ లో కేవలం 17 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. 


8. అక్షర్ పటేల్
చాహల్ ను కూడా కాదని ఇండియా అక్షర్ ను జట్టులోకి తీసుకుందంటే కారణం.. బ్యాటింగ్ స్కిల్స్ మాత్రమే. కానీ వరల్డ్ కప్ ముందు ఆకట్టుకున్న అక్షర్ టోర్నీలో నిరాశపర్చాడు. ఇండియా తరఫున ఎక్కువ ఎకానమీ అక్షర్ కే ఉంది. 8.62. బ్యాటింగ్ లో కూడా 3 ఇన్నింగ్స్ లో 9 పరుగులే చేశాడు.


9. ఒడియన్ స్మిత్
వెస్టిండీస్ బౌలర్. గ్రూప్ స్టేజ్ లో జరిగిన 2 మ్యాచెస్ లోనే 9.44 ఎకానమీతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. పించ్ హిట్టర్ గా కూడా ఆకట్టుకోలేకపోయాడు. 


10. ప్యాట్ కమిన్స్
ఆస్ట్రేలియా తరఫున విఫలమైన మరో స్టార్. టోర్నమెంట్ ముందే టెస్ట్ కెప్టెన్సీకి అదనంగా వన్డే సారథ్య బాధ్యతలు కూడా కమిన్స్ కు అందాయి. అంతటి విలువైన ప్లేయర్ ఆస్ట్రేలియాకు. ఆసీస్ తొలి 2 గేమ్స్ లో 46, 36 పరుగులు సమర్పించుకున్నాడు. ఐర్లాండ్, అఫ్గానిస్థాన్ మీద పర్వాలేదనిపించినా కమిన్స్ నుంచి ఆశించే ఆట మాత్రం ఇది కాదు.


11. కగిసో రబాడ
మరో స్టార్ పేస్ బౌలర్. సౌతాఫ్రికా తరఫున ఎక్కువ పరుగులు ఇచ్చుకున్నది రబాడనే. ఏ మ్యాచ్ లోనూ పూర్తిగా 4 ఓవర్లు వేయలేదు. 9.43 ఎకానమీతో పరుగులు ఇచ్చుకుని, టోర్నమెంట్ మొత్తం మీద 2 వికెట్లు మాత్రమే తీశాడు.