ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కాంట్రాక్ట్ విధానంలో స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా 434 స్టాఫ్ నర్స్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో భర్తీ చేస్తారు. జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 21న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు అక్టోబరు 5లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.


వివరాలు..


స్టాఫ్ నర్స్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 434 పోస్టులు


జోన్ వారీగా ఖాళీలు: జోన్-1: 86, జోన్-2:  220, జోన్-3: 34, జోన్-4: 94.


అర్హతలు: జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ(నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.


ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.


దరఖాస్తు ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామాలు:


The Regional Director of Medical and Health Services, 
Opp. Bullaiah College, Resapuvanipalem, Visakhapatnam, 


The Regional Director of Medical and Health Services, 
Govt General Hospital Compound, Rajamahendravaram.


The Regional Director of Medical and Health Services,
Aswini Hospital Backside, Old Itukulabatti Road, Guntur 


The Regional Director of Medical and Health Services, 
Old RIMS, Kadapa.


ముఖ్యమైన తేదీలు


➥ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 21.09.2023.


➥ ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 05.10.2023.


Notification & Application


Website


ALSO READ:


ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్‌) ట్రేడ్ అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 484 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను  భర్తీ చేయనున్నారు. ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు అక్టోబర్‌ 10లోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 'కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ ఎగ్జామినేషన్‌-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర గనుల శాఖ, జలవనరుల శాఖలో గ్రూప్‌-ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగాల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.200 చెల్లించి అక్టోబరు 10లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న ప్రిలిమినరీ పరీక్ష; జూన్ 22న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..