నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన సినిమా 'డెవిల్' (Devil Movie). ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక. ఇందులో సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయిక. 'బింబిసార' తర్వాత ఈ హీరో హీరోయిన్ జంటగా నటించిన రెండో చిత్రమిది. ఇటీవల ఈ సినిమాలో 'మాయ చేసే...' పాటను విడుదల చేశారు. ఆ పాటకు ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? 


విదేశీ వాయిద్యాలు తెప్పించిన అభిషేక్ నామా
మద్రాస్ ప్రెసిడెన్సీ, 1940 నేపథ్యంలో 'డెవిల్' తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆ కాలంలోకి తీసుకు వెళ్లేందుకు సంగీతాన్ని కూడా చక్కగా ఉపయోగించుకోవాలని పాటల మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు దర్శక నిర్మాత అభిషేక్ నామా, సంగీత దర్శకుడు హర్షవర్దన్ రామేశ్వర్. వాళ్ళిద్దరి ఆలోచనల నుంచి పుట్టిందే 'మాయే చేసే' వింటేజ్ సాంగ్‌. 


'మాయే చేసే...' పాటలో రకరకాల వాయిద్యాలు వాడారు. దక్షిణాఫ్రికా నుంచి జెంబో, బొంగొ, డీజెంబోలు... మలేసియా నుంచి డఫ్ డ్రమ్స్... చైనా నుంచి మౌత్ ఆర్గాన్, దర్భుకా... దుబాయ్ నుంచి ఓషియన్ పర్‌క్యూషన్, సింగపూర్ నుంచి ఫైబర్ కాంగో డ్రమ్స్, వెస్ట్ ఆఫ్రికా నుంచి హవర్ గ్లాస్, షేప్డ్ టాకింగ్ డ్రమ్ తదితర వాయిద్యాలను ఈ పాటలో వాడారు. అదీ సంగతి!


Also Read : నాని ఫస్ట్ టైమ్ ఎప్పుడు ప్రేమలో పడ్డారు? ఇప్పుడు ఆయన క్రష్ ఎవరో తెలుసా?



'మాయే చేసి మెల్లగా... 
మది దోచేసిందే సిన్నగా!
చూపే చూసి సన్నగా... 
నను చంపేసిందే సూటిగా!
ఒక నవ్వే నవ్వి నేరుగా... 
గుండెలనే పిండేసిందిగా!''
అంటూ ఈ పాట సాగింది. ఇందులో కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్ మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. హర్షవర్థన్ రామేశ్వర్ అందించిన బాణీకి సత్య ఆర్వీ సాహిత్యం సమకూర్చారు. సిద్ శ్రీరామ్ ఆలపించారు. బృందా మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.


Also Read : బాలకృష్ణ, రవితేజకు గట్టి పోటీ, దసరా బరిలో సిక్సర్ - 'జైలర్', 'జవాన్' సక్సెస్ రిపీట్ చేసేదెవరు?



నవంబర్ 24న 'డెవిల్' విడుదల!
ఆల్రెడీ 'డెవిల్' సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దేవాన్ష్‌ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. 


నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, సంయుక్తా మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైన్స్‌:  అశ్విన్ రాజేష్, రీ రికార్డింగ్ మిక్స్‌:  ఎ.ఎం. ర‌హ్మ‌తుల్లా, ఎం. ర‌హ్మ‌తుల్లా, స్టంట్స్‌:  వెంక‌ట్ మాస్ట‌ర్‌, కూర్పు : త‌మ్మిరాజు, కథా విస్తరణ : ప్ర‌శాంత్ బ‌రాడి, ఛాయాగ్రహణం :  సౌంద‌ర్ రాజ‌న్‌ .ఎస్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  గాంధీ న‌డికుడిక‌ర్‌, క‌థ‌ - కథనం - మాట‌లు : శ్రీకాంత్ విస్సా, సంగీతం :  హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌, సమ‌ర్ప‌ణ‌:  దేవాన్ష్ నామా, నిర్మాణ సంస్థ : అభిషేక్ పిక్చ‌ర్స్‌, నిర్మాణం - దర్శకత్వం : అభిషేక్ నామా. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial