బెంగ‌ళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్‌), తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 1 వరకు దరఖాస్తులు సమర్పించి, నవంబరు 4లోగా నిర్ణీత చిరునామాకు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు.


వివరాలు..


మొత్తం ఖాళీలు: 11


కాంట్రాక్ట్ వ్యవధి: 2 సంవత్సరాలు.


➥ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 04 


అర్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్/ కంప్యూటర్ సైన్స్). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.


➥ ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్స్‌:  07


అర్హత: 60 శాతం మార్కులతో డిప్లొమా (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.


వయోపరిమితి: 01.10.2023 నాటికి 32 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. 


దరఖాస్తు ఫీజు: రూ.200.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.


జీతభత్యాలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.82,620, ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులకు నెలకు రూ.46,130 చెల్లిస్తారు. ఇతర భత్యాలు కూడా అందుతాయి.


దరఖాస్తు హార్డ్‌కాపీలు పంపాల్సిన చిరునామా:
AGM (HR), 
Bharat Heavy Electricals Limited, 
Electronics Division, P. B. No. 2606, 
Mysore Road, Bengaluru-560026.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 01.11.2023.


➥ దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది: 04.11.2023.


➥ దరఖాస్తు హార్డ్‌కాపీల సమర్పణకు చివరితేది (దూరప్రాంతాల వారికి): 07.11.2023.


Notification


Online Application


Website


ALSO READ:


ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే
ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్‌ఎంఎస్) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 650 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్న అభ్యర్థులు నవంబర్ 5 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఇంటెలిజెన్స్ బ్యూరోలో 677 ఉద్యోగాల దరఖాస్తులు ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర హోంవ్యవహారాల మంత్రిత్వ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరోలో  677 సెక్యూరిటీ అసిస్టెంట్/మోటార్ ట్రాన్స్‌పోర్ట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 14న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన వారు నవంబరు 13 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదోతరతగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే ప్రాంతీయ భాషలో నైపుణ్యం ఉండాలి.  అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, మహిళా అభ్యర్థులు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. టైర్-1, టైర్-2 రాతపరీక్షల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 
పోస్టులు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..