ఐసీఏఐ సీఏ పరీక్షల అడ్మిట్‌కార్డులను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అక్టోబరు 16న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 2 నుంచి 17 వరకు సీఏ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే నవంబరు 1 నుంచి 16 వరకు ఇంటర్ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు.


అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..


సీఏ ఇంటర్ పరీక్షల షెడ్యూలు..


గ్రూప్– 1:


➥ పేపర్-1: 02.11.2023 (2 pm to 5 pm)


➥ పేపర్-2: 04.11.2023 (2 pm to 5 pm) 


➥ పేపర్-3: 06.11.2023 (2 pm to 5 pm) 


➥ పేపర్-4: 08.11.2023 (2 pm to 5 pm) 


గ్రూప్ – 2:


➥ పేపర్-5: 10.11.2023 (2 pm to 5 pm) 


➥ పేపర్-6: 12.11.2023 (2 pm to 5 pm) 


➥ పేపర్-7: 13.11.2023 (2 pm to 5 pm)


➥ పేపర్-8: 17.11.2023 (2 pm to 5 pm) 


సీఏ ఫైనల్ పరీక్షల షెడ్యూలు..


గ్రూప్– 1:


➥ పేపర్-1: 01.11.2023 (2 pm to 5 pm)


➥ పేపర్-2: 03.11.2023 (2 pm to 5 pm) 


➥ పేపర్-3: 05.11.2023 (2 pm to 5 pm) 


➥ పేపర్-4: 07.11.2023 (2 pm to 5 pm) 


గ్రూప్ – 2:


➥ పేపర్-5: 09.11.2023 (2 pm to 5 pm) 


➥ పేపర్-6: 11.11.2023 (2 pm to 5 pm) 


➥ పేపర్-7: 14.11.2023 (2 pm to 5 pm) 


➥ పేపర్-8: 16.11.2023 (2 pm to 5 pm) 


ALSO READ:


ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులు, ప్రవేశాలు ఇలా
గుంటూరులోని ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు. ఈ కోర్సుల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 13న ప్రారంభంకాగా.. నవంబరు 3 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పీజీ కోర్సులకు డిగ్రీ మార్కులు, ఏఐఈఈఏ (ఐకార్‌) స్కోరు; పీహెచ్‌డీ కోర్సులకు డిగ్రీ, పీజీ మార్కులు, ఏఐసీఈ (ఐకార్‌) స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.1500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీలో పీజీడీఎం ప్రోగ్రామ్, ఈ అర్హతలుండాలి
పుణెలోని నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ, 2024 విద్యా సంవత్సరానికి పీజీడీఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌, ఎక్స్‌ఏటీ, సీమ్యాట్‌ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ-ఎన్‌సీ అభ్యర్థులకు 28 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 30 ఏళ్లు మించకూడదు.  విద్యార్హతలు, పని అనుభవం, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...