విజయవాడలోని ప్రసార భారతి, ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ- రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్ట్ టైమ్ కరస్పాండెంట్(పీటీసీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు. డిగ్రీతోపాటు న్యూస్‌ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94406 74057 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.


వివరాలు..


* పార్ట్ టైమ్ కరస్పాండెంట్లు


జిల్లాలు: విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా, ఏలూరు, బాపట్ల, నంద్యాల, పల్నాడు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, విజయవాడ-అమరావతి (క్యాపిటల్ ఆర్‌ఎన్‌యూ).


అర్హత: డిగ్రీతోపాటు న్యూస్‌ రిపోర్టింగ్‌లో కనీసం రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. * అభ్యర్థులు జిల్లా కేంద్రం నుంచి 10 కిలోమీటర్ల లోపు నివసిస్తున్న వారై ఉండాలి.


వయోపరిమితి: 24 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, అవసరమైన అన్ని ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలను జతచేసి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి.


ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం ఆధారంగా.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Head of Office, 
Akashvani, 
MG Road, 
Vijayawada-520002.


దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 30.10.2023.



 


Website


ALSO READ:


ఆప్కాబ్‌‌లో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, ఎంపికైతే రూ.49 వేల వరకు జీతం
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 7న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. అక్టోబరు 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. నవంబరులో రాతపరీక్ష నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


కాకినాడ సహకార బ్యాంకులో 33 ఆఫీసర్, క్లర్క్ పోస్టులు - ఈ అర్హతలుండాలి
కాకినాడలోని కాకినాడ కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ పలు శాఖల్లో ఆఫీసర్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు, అనుభవం ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆఫీసర్ క్లర్క్ కమ్ క్యాషియర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అసిస్టెంట్ సీఈవో, మేనేజర్ పోస్టులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


బీహెచ్‌ఈఎల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్ పోస్టులు - ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా అర్హతలు
బెంగ‌ళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్‌), తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు ఇంజినీరింగ్ డిగ్రీ, ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ పోస్టులకు డిప్లొమా అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 1 వరకు దరఖాస్తులు సమర్పించి, నవంబరు 4లోగా నిర్ణీత చిరునామాకు దరఖాస్తు హార్డ్ కాపీలను పంపాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఖాళీలను భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..