భోపాల్‌లోని ఆల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) అటెండెంట్, క్యాషియర్ & పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 357 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి అక్టోబరు 27న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. నవంబరు 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.


వివరాలు..


ఖాళీల సంఖ్య: 357 పోస్టులు


➥ హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-III: 106 పోస్టులు
అర్హత: మెట్రిక్ ఉత్తీర్ణత
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-II: 41 
అర్హత: 10+2, DMLT ఉత్తీర్ణత
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: 38 పోస్టులు
అర్హత: 10+2 (సైన్స్)/ B.Sc. (మెడికల్ రికార్డ్స్) ఉత్తీర్ణత
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ ఫార్మసిస్ట్ గ్రేడ్-II: 27 పోస్టులు
అర్హత: డిప్లొమా(ఫార్మసీ) ఉత్తీర్ణత
వయోపరిమితి: 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ వైర్‌మ్యాన్: 20 పోస్టులు
అర్హత: 10వ తరగతి, ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ శానిటరీ ఇన్‌స్పెక్టర్ గ్రేడ్-II :18 పోస్టులు
అర్హత: 12 + హెల్త్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ కోర్సు
వయోపరిమితి: 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ ప్లంబర్: 15 పోస్టులు
అర్హత: ఐటీఐ డిప్లొమా
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ కళాకారుడు (మోడలర్): 14 పోస్టులు
అర్హత: మెట్రిక్/ డిప్లొమా
వయోపరిమితి: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ క్యాషియర్: 13 పోస్టులు
అర్హత: డిగ్రీ (కామర్స్)
వయోపరిమితి: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ ఆపరేటర్ (E&M)/ లిఫ్ట్ ఆపరేటర్: 12 పోస్టులు
అర్హత: 10వ తరగతి, ఐటీఐ డిప్లొమా
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్: 05 పోస్టులు
అర్హత: 10+2, డిప్లొమా/ B.Sc. (వైద్య రికార్డులు)
వయోపరిమితి: 21-35 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ మానిఫోల్డ్ టెక్నీషియన్ (గ్యాస్‌స్టీవార్డ్) / గ్యాస్ కీపర్: 06
అర్హత: 10+2, ఐటీఐ డిప్లొమా పోస్టులు
వయోపరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ ఎలక్ట్రీషియన్: 06 పోస్టులు
అర్హత: 10వ తరగతి, ఐటీఐ డిప్లొమా
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.


➥ మెకానికల్ (ఏసీ & రిఫ్రిజిరేటర్): 06 పోస్టులు
అర్హత: 10వ తరగతి, ఐటీఐ డిప్లొమా. 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-40 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ డార్క్ రూమ్ అసిస్టెంట్ గ్రేడ్-2: 05 పోస్టులు
అర్హత: డిప్లొమా (రేడియోగ్రఫీ). ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ అసిస్టెంట్ లాండ్రీ సూపర్‌వైజర్: 04 పోస్టులు
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. డిప్లొమా/సర్టిఫికేట్ (డ్రై క్లీనింగ్/లాండ్రీ టెక్నాలజీ). రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ డిస్పెన్సింగ్ అటెండెంట్స్: 04 పోస్టులు
అర్హత: డిప్లొమా(ఫార్మసీ). 
వయోపరిమితి: 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥  మెకానిక్ (E & M): 04 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐటీఐ డిప్లొమా సర్టిఫికేట్ (ఎలక్ట్రీషియన్ ఇంజినీరింగ్/మెకానికల్ ఇంజినీరింగ్). రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్-2: 03 పోస్టులు
అర్హత: సర్టిఫికేట్/డిప్లొమా (లైబ్రరీ సైన్స్/ లైబ్రరీ & ఇన్‌ఫర్మేషన్ సర్వీస్)
వయోపరిమితి: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ గ్యాస్/ పంప్ మెకానిక్: 02 పోస్టులు
అర్హత: ఇంటర్ (సైన్స్) లేదా తత్సమాన విద్యార్హతతోపాటు 200 పడకల ప్రభుత్వాసుపత్రి మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ సిస్టమ్ విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా ట్రేడ్ సర్టిఫికేట్/ఐటీఐ డిప్లొమా(మెకానికల్ ఇంజినీరింగ్)తోపాటు మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ లైన్‌మ్యాన్ (ఎలక్ట్రికల్): 02 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥  టైలర్ గ్రేడ్-3: 02 పోస్టులు
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఐటీఐ(టైలరింగ్) సర్టిఫికేట్ ఉండాలి.
వయోపరిమితి: 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥ ల్యాబ్ టెక్నీషియన్: 01 పోస్టు
అర్హత: ఇంటర్ (సైన్స్) లేదా తత్సమాన విద్యార్హతతోపాటు డిప్లొమా (ఎంఎల్‌టీ). బీఎస్సీ (ఎంఎల్‌టీ) ఉన్నవారికి ప్రాధాన్యం.
వయోపరిమితి: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥  ఫార్మా కెమిస్ట్/కెమికల్ ఎగ్జామినర్: 01 పోస్టు
అర్హత: డిప్లొమా (ఫార్మసీ).
వయోపరిమితి: 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥  కోడింగ్ క్లర్క్: 01 పోస్టు
అర్హత: బీఎస్సీ (మెడికల్ రికార్డ్స్) లేదా ఇంటర్ (సైన్స్)తోపాటు కనీసం 6 నెలల డిప్లొమా/సర్టిఫికేట్ కోర్సు(మెడికల్ రికార్డ్స్). రెండేళ్ల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


➥  మ్యానిఫోల్డ్ రూమ్ అటెండెంట్: 01 పోస్టు
అర్హత: ఇంటర్ (సైన్స్). 200 పడకల ప్రభుత్వాసుపత్రి మెడికల్ గ్యాస్ పైప్‌లైన్ సిస్టమ్ విభాగంలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి. 
వయోపరిమితి: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.


వయోసడలింపు: ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, డిఫెన్స్ పర్సన్స్‌కు 3-8 సంవత్సరాలు, వితంతు/ఒంటరి/విడాకులు పొందిన మహిళలకు 35-40 సంవత్సరాల వరకు వయోసడలింపు ఉంటుంది. ఇక కేంద్ర ప్రభుత్వ సివిలియన్ అభ్యర్థులకు 40-45 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.


దరఖాస్తు ఫీజు: రూ.1200. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.600.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: సీబీటీ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.


సీబీటీ పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు విభాగాల(పార్ట్-ఎ: 25 ప్రశ్నలు, పార్ట్-బి: 75 ప్రశ్నలు) నుంచి మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతిప్రశ్నకు ఒకమార్కు. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల చొప్పున కోత విధిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.10.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2023.


Notification


Online Application


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..