Type 1.5 Diabetes Symptoms: మనుషులు ఎలా అప్ డేట్ అవుతున్నాయో, రోగాలు కూడా అలాగే అప్ డేట్ అవుతున్నాయి. ఇప్పటి వరకు టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ వ్యాధులు ఉండగా, ఇప్పుడు కొత్తగా డయాబెటిస్ 1.5 వచ్చి చేరింది. లేటెంట్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ లేదంటే LADA అని పిలుస్తారు. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు రెండూ 1.5లో కనిపిస్తాయి. 


టైప్ 1.5 ఎలా సోకుతుందంటే?


టైప్ 1 డయాబెటిస్ అనేది పుట్టుకతోనే వస్తుంది. చిన్న పిల్లలోనూ ఇది కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే.. వారసత్వంగా ఈ డయాబెటిస్ వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ అనేది ఆనారోగ్యకరమైన జీవన విధానంతో సోకుతుంది. సరిగా తినడకపోవడం, టైమ్ కు నిద్రపోకపోవడం సహా పలు కారణాలో వస్తుంది. ఇక టైప్ 1.5 డయాబెటిస్ అనేది పెద్దలో మాత్రమే వస్తుంది. పిల్లల్లో ఈ టైప్ డయాబెటిస్ కనిపించదు. ఈ టైప్ డయాబెటిస్ బాడీపై నెమ్మదిగా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్యాంక్రియాసిస్ తగినంత ఇన్సులిన్ ను ప్రొడ్యూస్ చేయడాన్ని నిలిపివేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిచేసే కణాలకు వ్యతిరేకంగా శరీరంలోని యాంటీ బాడీలు పని చేస్తాయి. దీనివల్ల ప్యాంక్రియాసిస్ దెబ్బతిని ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. టైప్ 1.5 డయాబెటిస్ మొదలవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ తో బాధపడుతున్న వారిలో సుమారు 15 శాతం మంది టైప్ 1.5 డయాబెటిస్ తో బాధపడుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి.  టైప్ 1.5 డయాబెటిస్ అనేది 30 ఏండ్లు పైబడిన వ్యక్తులలోనే కనిపిస్తుంది. ఈ రకం డయాబెటిస్ సోకిన చాలా మంది టైప్ 2 అనుకుంటారని నిపుణులు వెల్లడించారు. టైప్2 మందులనే దీనికి కూడా వాడుతారు. అయితే, శరీరంలోఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిన తర్వాతే ఆ మందులు పని చేస్తాయంటున్నారు.


టైప్ 1.5 డయాబెటిస్ లక్షణాలు ఇవే!


సాధారణంగా టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు రెండూ ఇందులో కనిపిస్తాయి. కొన్ని లక్షణాలను బట్టి తమకు టైప్ 1.5 సోకిందని గుర్తించే అవకాశం ఉంది.


1.దాహం పెరుగుతుంది.


2.తరచుగా మూత్రం వస్తుంది.


3.వినరీతమైన అలసట ఏర్పడుతుంది.


4.చూపు మందగించడం


5.సడెన్ గా బరువు తగ్గడం


ఈ లక్షణాలు ఉంటే టైప్ 1.5 డయాబెటిస్ ఉన్నట్లు గుర్తించాలి. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. ఈ వ్యాధి సోకినవాళ్లు రోజంతా వారి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను గమనిస్తూ ఉండాలి. లేదంటే  శరీరంలో సరిపడ ఇన్సులిన్ లేక శరీరం సరిపడ చక్కెరను పొందలేదు. ఈ నేపథ్యంలో శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగి, ప్రమాదకరంగా మారుతుంది. అందుకే, టైప్ 1.5 డయాబెటిస్ కు విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.   


Read Also: తీపి తినకుండానే మీకు డయాబెటిస్ వచ్చేసిందా? కారణం.. కరోనా అంటే నమ్ముతారా? ఇదిగో కొత్త ముప్పు!



Read Also: ఇంట్లో మునగ చెట్టు ఒకటి ఉంటే చాలు.. ఈ సమస్యలన్నీ పరార్, ఇన్ని లాభాలు ఉంటాయని మీరు ఊహించి ఉండరు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.