మూలశంక - దీన్ని చాలామంది తిట్టు లేదా చెడ్డ పదం అనుకుంటారు. మరికొందరు దీన్ని పలికేందుకు చాలా ఇబ్బందిపడతారు. అంతేకాదు, ఈ సమస్య వస్తే.. ఎవరికీ చెప్పుకోలేరు కూడా. చర్చించేందుకు, బయటకు చెప్పుకొనేందుకు సిగ్గుపడతారు. అప్పుడప్పుడు అనుకోని అతిథిలా వచ్చి పలకరించే ఈ సమస్య.. కొందరిలో తీవ్రంగా ఉంటుంది. నడవడానికి, కూర్చోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ సమస్యను వైద్య పరిభాషలో హెమోరాయిడ్స్ అని అంటారు. మనం ఎక్కువగా ‘పైల్స్’ అని పిలుస్తాం. 


హెమోరాయిడ్స్(Hemorrhoids) అనేది గ్రీకు పదం. రక్తాన్ని విడుదల చేసే సిరలు అని అర్థం. పాయువు, దిగువ పురీష నాళంలో విస్తరించిన రక్త నాళాలను ‘హెమోరాయిడ్స్’ అని పిలుస్తారు. హెమోరాయిడ్స్ ఉబ్బినప్పుడు.. మల విసర్జన కష్టమవుతుంది. దురద, నొప్పి, చికాకు ఏర్పడుతుంది. కొందరిలో రక్తం కూడా వస్తుంది. వాపు వల్ల ఆ ప్రాంతం నొప్పిగా అనిపిస్తుంది. అదే పైల్స్ నొప్పి. మానవ జీవితంలో ప్రతి ఒక్కరికీ ఈ సమస్య వస్తుంది. ప్రతి నలుగురిలో ముగ్గురికి పైల్స్ వస్తాయని, ఈ సమస్య వయస్సుతోపాటు పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


పైల్స్ ప్రధానంగా మూడు రకాలు


అంతర్గత హేమోరాయిడ్స్: ఈ సిరలు పాయువు లోపల ఉంటాయి. ఇవి పెద్దగా నొప్పిగా అనిపించవు. పైల్స్ వచ్చిన సంగతే తెలీదు. శరీరానికి కూడా ఎలాంటి అసౌకర్యం ఉండదు.
బాహ్య హేమోరాయిడ్స్: ఈ సిరలు పాయువు చర్మం క్రింద ఉంటాయి. ఆ ప్రాంతంలో నొప్పి, అసౌకర్యం, దురద కలిగిస్తాయి.
థ్రాంబోస్డ్ హేమోరాయిడ్‌లు: బాహ్య పాయువులోని సిరల్లోని రక్తం గడ్డకట్టినట్లయితే.. దానిని థ్రోంబోస్డ్ హేమోరాయిడ్ అంటారు. ఈ నొప్పి చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది.


పైల్స్ రావడానికి కారణాలివే:


⦿ ఊబకాయం
⦿ ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం
⦿ గర్భం
⦿ పెద్దప్రేగు కాన్సర్
⦿ దీర్ఘకాలిక అతిసారం లేదా మలబద్దకం
⦿ ప్రేగు కదలికల సమయంలో ఒత్తిడి
⦿ టాయిలెట్‌లో ఎక్కువ సేపు కూర్చోవడం
⦿ గర్భం
⦿ పెద్దప్రేగు కాన్సర్
⦿ మునుపటి మల శస్త్రచికిత్స
⦿ అంగ సంపర్కం కలిగి ఉండటం


బాహ్య హేమోరాయిడ్స్ లక్షణాలు:


⦿ ఆసన ప్రాంతంలో దురద మరియు చికాకు
⦿ మలద్వారం చుట్టూ వాపు
⦿ వెనుక నుంచి రక్తస్రావం
⦿ నొప్పి, అసౌకర్యం


అంతర్గత హేమోరాయిడ్స్ లక్షణాలు:


⦿ ప్రేగులు వెళ్ళేటప్పుడు నొప్పిలేకుండా రక్తస్రావం
⦿ నొప్పి, చికాకు కలిగించే ఆసన ప్రారంభానికి సమీపంలో వాపు


థ్రోంబోస్డ్ హేమోరాయిడ్స్ లక్షణాలు:


⦿ మలద్వారం దగ్గర గట్టి ముద్ద
⦿ వాపు
⦿ విపరీతమైన నొప్పి


మల విసర్జన కష్టమైనప్పుడు హేమోరాయిడ్స్‌లో రక్తస్రావం జరగడం సాధారణ విషయమే. అయితే, తరచుగా రక్తస్రావం జరుగుతుంటే మాత్రం తప్పకుండా మీరు వైద్యులను సంప్రదించాలి. ముఖ్యంగా హేమోరాయిడ్స్‌లో రక్తం గడ్డకట్టం, తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంటే తప్పకుండా డాక్టర్‌ను కలవాలి. ఎందుకంటే దీర్ఘకాలికంగా రక్తం పోతుంటే.. రక్తహీనత సమస్య వస్తుంది. అంతర్గత హేమోరాయిడ్‌కు రక్త సరఫరా నిలిచిపోతే.. అది సిరను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఫలితంగా విపరీతమైన నొప్పిని ఏర్పడుతుంది. 


ఎలా నివారించాలి?


⦿ మల విసర్జన కష్టమైనప్పుడు బలవంతంగా ప్రయత్నించకూడదు.
⦿ పండ్లు, కూరగాయలు, అధిక ఫైబర్ ఆహారాలు మలాన్ని మృదువుగా చేయడానికి సహాయపడతాయి. 
⦿ పుష్కలంగా ద్రవాలు త్రాగడం, సుమారు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. 
⦿ మద్యం తాగడం ముఖ్యంగా మీరు ఏదైనా ఫైబర్ సప్లిమెంట్లను తీసుకుంటే.
⦿ నిత్యం వ్యాయామం చేయడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు మరియు సిరలపై ఒత్తిడిని తగ్గించవచ్చు.
⦿ టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చోని మల విసర్జనకు ప్రయత్నించ కూడదు. 


స్పైసీ ఫుడ్స్ తినడం వల్లే పైల్స్ వస్తాయా?: పైల్స్ మీద చాలా అపోహలు ఉన్నాయి. స్పైసీ ఫుడ్ తినడం వల్లే పైల్స్ వస్తాయనే ప్రచారం ఉంది. అయితే, అందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. పాయువు నాళాలు అధిక ఒత్తిడికి గురైనప్పుడు మాత్రమే హేమోరాయిడ్లు వస్తాయి. స్పైసీ ఫుడ్ తినడం వల్ల కాదు. అలాగే హేమోరాయిడ్స్ (పైల్స్) క్యాన్సర్‌గా అభివృద్ధి చెందుతాయనే విషయంలో కూడా నిజం లేదు. అయితే, మీకు ఇప్పటికే పైల్స్ సమస్య ఉంటే మాత్రం.. తప్పకుండా స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పైల్స్ బాధితులు స్పైసీ ఫుడ్ లేదా చికెన్ మంటన్ వంటి ఆహారాన్ని తినడం వల్ల మలం గట్టిగా మారుతుంది. అది బయటకు వెళ్లేప్పుడు మలద్వారంపై ఒత్తిడి పెరిగితే.. పైల్స్ ఏర్పాడతాయి. అధిక ఒత్తిడికి నాళాలు చిట్లి రక్తస్రావం జరుగుతుంది. ఇలా కాకూడదంటే. అధిక ఫైబర్ ఆహారాలు తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఆపిల్స్, మొక్కజొన్న, బెర్రీస్, చిలకడ దుంపలు, టమోటాలు వంటి పండ్లు, కూరగాయలతోపాటు తృణధాన్యాలు తీసుకోవాలి. అవి మలం మృదువుగా, ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. గ్యాస్ రాకుండా ఉండాలంటే ఫైబర్‌లను ఆహారంలో నెమ్మదిగా చేర్చుకోవాలి.


ట్రీట్మెంట్ ఎలా?


రక్తస్రావం ఎక్కువగా ఉన్నా, నొప్పి తీవ్రత పెరిగినా డాక్టర్‌ను సంప్రదించాలి. అయితే, వైద్య పరీక్షలకు సిద్ధమైనప్పుడు మాత్రం మీరు సిగ్గును పక్కన పెట్టాలి. ఎందుకంటే డాక్టర్ చేతికి గ్లవ్స్ వేసుకుని.. వేలికి లూబ్రికేట్ రాసుకుని పాయువులోకి చొప్పిస్తారు. అప్పటికీ సమస్య గుర్తించడం కష్టమైతే.. అనోస్కోప్, సిగ్మాయిడోస్కోప్ లేదా ప్రోక్టోస్కోప్‌తో పరీక్షిస్తారు. నొప్పి తగ్గించేందుకు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. సాధారణ చికిత్సతోనే పైల్స్‌ను తగ్గించుకోవచ్చు. ఎన్ని చికిత్స విధానాలు పాటించినా ఫలితం లేకపోతే.. హేమోరాయిడ్ తొలగింపు కోసం సర్జరీ చేస్తారు. దీన్నే హెమోరోహైడెక్టమీ అంటారు. ఈ చికిత్సంలో భాగంగా రక్తస్రావం కలిగించే అదనపు కణజాలాన్ని సర్జన్ తొలగిస్తారు.


Also Read: చలికాలంలో హైబీపీని అదుపులో ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే