బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే ఆయన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రెటీలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే తమ అభిమాన హీరోకు విషెస్ చెప్పడానికి సల్మాన్ ఇంటి వద్ద వేలాది మంది అభిమానులు గుమిగూడారు. తన నివాసం నుంచి అభిమానులకు అభివాదం చేశాడు సల్మాన్. సల్లూ భాయ్ ను చూసి ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ విజిల్స్ వేస్తూ రచ్చ చేశారు. ఇక సల్మాన్ ను కలవాలనే ఉద్దేశంతో మధ్యప్రదేశ్ కు చెందిన సమీర్ అనే యువకుడు ముంబైకు వచ్చాడు. సల్మాన్ పుట్టిన రోజు నాడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు విపరీతమైన చలిని కూడా లెక్క చేయకుండా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ నుంచి దాదాపు 1,100 కిలో మీటర్లు సైకిల్ తొక్కుకొని ముంబై చేరుకున్నాడు ఆ యువకుడు. 


సరిగ్గా సల్మాన్ పుట్టిన రోజు నాడు సమీర్ ముంబై బాంద్రాలోని సల్మాన్ ఇంటికి వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో సల్మాన్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. సమీర్ తనను కలవడానికి చాలా దూరం నుంచి సైకిల్ పై వచ్చినట్టు ఆయన కు సమాచారం అందింది. దీంతో ఆయన వెంటనే బయటకు వచ్చి సమీర్ ను కలిశాడు. అంతే కాకుండా సమీర్ తో ఓ ఫోటో దిగాడు. ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు సల్మాన్. సమీర్ సాహసాన్ని సల్మాన్ అభినందించాడు. దీంతో ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. అలాగే సల్మాన్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తుగా తన సైకిల్ పై ‘బీయింగ్ హ్యూమన్’ అని రాసుకున్నాడు సమీర్. సల్మాన్ ఖాన్‌ను కలవగానే సమీర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడట. సంతోషాన్ని తట్టుకోలేక ఏడ్చేశాడట.  



Read Also: హాలీవుడ్ నటుడు, మార్వెల్ హీరో జెరెమీ రెన్నెర్‌కు ప్రమాదం, పరిస్థితి విషమం?







డిసెంబరు 27న సల్మామ్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి వేలాది మంది అభిమానులు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఒకే సారి వేల మంది అక్కడ రోడ్లపై చేరడంతో చాలా సేపు ట్రాఫిక్ జామ్ అయింది.  ఆ క్రౌడ్ ను కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా సేపు ప్రయత్నించారు.  ఆ గుంపును చెదరగొట్టడానికి ఓ దశలో లాఠీ చార్జి చేశారు కూడా. ఇక సల్మాన్ ఖాన్ కు గతం నుంచి బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి. అందుకే ఆయన ఇంటి వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' షూటింగ్ దశ పూర్తయింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీను  ఫర్హాద్ సామ్జీ తెరకెక్కించారు. ఇందులో టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌ గా కనిపించనుంది. అలాగే టాలీవుడ్ స్టార్ హీారో విక్టరీ వెంకటేష్‌ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం 2023 రంజాన్‌ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా విడుదల కానుంది.