ధిక రక్తపోటు ఒక సైలెంట్ కిల్లర్. చలికాలంలో అనేక అనారోగ్యాలు తీవ్రతరం అవుతాయి. వాటిలో అధిక రక్తపోటు కూడా ఒకటి. హై బీపీని హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. దీని వల్ల గుండెపై తీవ్రమైన ఒత్తిడి పడి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవే కాదు చేసే పనులు కూడా దీని మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. సరైన సమయంలో చికిత్స చేయకపోతే మూత్రపిండాలకి హనీ కలిగించవచ్చు. స్ట్రోక్, ఇతర ఆరోగ్య సమస్యలకి దారి తీస్తుంది. తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు నుంచి రక్తం కారడం వంటివి హైబీపీ లక్షణాలు.


రక్తపోటు స్థాయిలని అదుపులో ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా సోడియం స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు ఉప్పు తగ్గించుకోవాలి. ఈ సూపర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


మెంతి గింజలు: వీటిలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎల్డీఎల్ స్థాయిలని, మొత్తం కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతే కాదు మెంతి గింజలు లేదా మెంతి ఆకులో ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. 


నారింజ: విటమిన్-C పుష్కలంగా ఉండే వాటిలో నారింజ ముందుంటుంది. ఈ సిట్రస్ పండు హైపర్ టెన్షన్ పేషెంట్లకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలో మెగ్నీషియం, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండూ రక్తపోటుని తగ్గిస్తాయి. ఆరెంట్ జ్యూస్ తీసుకున్నా కూడా హైపర్ టెన్షన్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.


ఆకుపచ్చ కూరగాయలు: గ్రీన్ వెజిటబుల్స్ అనవసరమైన ఉప్పుని తొలగించడంలో సహాయపడతాయి. ఆకుపచ్చ కూరగాయలు పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తపోటుని తగ్గించడానికి బచ్చలి కూర, క్యాబేజీ, కాలే, ఫెన్నెల్ లేదా పాలకూరని ఆహారంలో చేర్చుకోవాలి.


బీట్ రూట్: బీట్ రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని విటమిన్-B నరాల పనితీరుని మెరుగుపరుస్తుంది. రక్తనాళాలు సడలించి రక్తప్రవాహాన్నిపెంచుతుంది. రక్తపోటుని తగ్గిస్తుంది.


ముల్లంగి: ముల్లంగి నుంచి లభించే పొటాషియం రక్తప్రసరణ నియంత్రించడంలో సహాయపడుతుంది. రక్తపోటుని తగ్గిస్తుంది. సలాడ్ లు లేదా సూప్ లో ముల్లంగిని చేర్చుకోవచ్చు.


వెల్లుల్లి: రక్తపోటుని నియంత్రించడానికి వివిధ మార్గాలలో సహాయపడే అద్భుతమైన ప్రయోజనాలు కలిగిన మూలిక వెల్లుల్లి. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం వెల్లుల్లి నీరు తాగొచ్చు. లేదంటే పచ్చి వెల్లుల్లి తిన్నా మంచి ఫలితాలు పొందుతారు.


పెరుగు: రక్తపోటుని తగ్గించడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొవ్వు తక్కువగా ఉండే పెరుగు ఆహారంలో చేర్చుకోవాలి. ఇది రక్తపోటుని నియంత్రిస్తుంది. ఇందులో కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఎముకల్ని గట్టి పరుస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: బరువు తగ్గడానికి ఇవి తీసుకుంటున్నారా? జాగ్రత్త, అవి సీక్రెట్‌గా వెయిట్ పెంచేస్తాయ్!