కొవాగ్జిన్ టీకాను ఎట్టకేలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గుర్తించింది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (ఈయూఎల్) స్టేటస్ ఇవ్వాలని నిపుణుల కమిటీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు సూచించింది. కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్ డేటాను పరిశీలించిన అనంతరం డబ్ల్యూహెచ్ఓ అత్యవసర వినియోగ అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. 










ఇటీవల కొవాగ్జిన్‌కు అనుమతి వస్తుందని అంతా భావించినప్పటికీ తుది మదింపునకు గాను భారత్ బయోటెక్ నుంచి అదనపు సమాచారం అవసరమని డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం ఇటీవల తెలిపింది. తుది మదింపునకు ఈరోజు సాంకేతిక బృందం సమావేశమైంది. ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ కోసం డబ్ల్యూహెచ్ఓకు సూచించింది.డబ్ల్యూహెచ్ఓ ఈ స్టేటస్ ఇస్తున్నట్లు ప్రకటించింది.


దేశంలో ఇప్పటికే కోట్లాది మంది కొవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. అయితే ఈ టీకా పొందిన వాళ్లు విదేశాలకు వెళ్లడం కష్టతరంగా మారడంతో అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని భారత్ బయోటెక్ సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థను ఇటీవల కోరింది. చాలా దేశాలు డబ్ల్యూహెచ్ఓ ఇచ్చే ఈ అనుమతులను ఆధారంగా చేసుకుంటున్నాయి. దీంతో కొవాగ్జిన్ టీకా వేసుకున్న భారతీయులకు విదేశీ ప్రయాణాలు కష్టంగా మారాయి. ఎట్టకేలకు డబ్ల్యూహెచ్ఓ అనుమతి లభించింది. 


కరోనాపై తయారు చేసిన తొలి దేశీయ టీకా కొవాగ్జిన్. ప్రపంచవ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోన్న సమయంలో కొవాగ్జిన్ టీకాను భారత్ బయోటెక్ తయారు చేసింది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ కరోనా డెల్టా వేరియంట్లను కూడా సమర్థంగా ఎదుర్కోగలుగుతున్నట్లు తేలింది.


Also Read: 100% Covid Vaccine: 'వ్యాక్సినేషన్‌లో అలసత్వం వహిస్తే.. మరో ముప్పు తప్పదు.. జాగ్రత్త'


Also Read: Vaccine for Children: చిన్నారుల వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం.. బైడెన్ ప్రభుత్వం కీలక నిర్ణయం


Also Read: Deepotsav in Ayodhya: అయోధ్యలో దీపోత్సవం.. గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌ వెయిటింగ్!


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 11,903 కేసులు నమోదు.. 252 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు


Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు


Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే


Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి