భారతదేశంలో చాలామంది మహిళలను వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ సమస్య ప్రధానమైనది. ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది, కానీ తగ్గడం లేదు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా థైరాయిడ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎంత మందులు వాడినా థైరాయిడ్ సమస్య పూర్తిస్థాయిలో తగ్గదు. మందులతో పాటు కొన్ని ఆహార నియమాలను పాటిస్తే ఈ సమస్య పూర్తిస్థాయిలో తగ్గే అవకాశం ఉంది. థైరాయిడ్‌ను నియంత్రించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ ఇచ్చాము.


 కొబ్బరి నూనె 
థైరాయిడ్ సమస్యలను అదుపులో ఉంచడంలో కొబ్బరి నూనె మనకు ఎంతగానో సహాయపడుతుంది. రోజూ ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె ఒక గ్లాస్ వేడి నీటిలో లేదా ఒక గ్లాసు పాలల్లో కలిపి తాగాలి. అన్నం తినే ముందు ఒక ముద్ద అన్నంలో ఒక స్పూను కొబ్బరి నూనె కలుపుకొని తిన్నా మంచిదే. ఇలా రోజూ చేయడం వల్ల థైరాయిడ్ సమస్య కొన్ని రోజులకు అదుపులో ఉంటుంది. 


పెరుగు 
పెరుగులో  థైరాయిడ్ ను అదుపులో ఉంచే లక్షణం ఉంటుంది. ప్రతిరోజూ ఒక కప్పు పెరుగును తీసుకోవడం వల్ల థైరాయిడ్ తగ్గుతుంది.


కొత్తిమీర
దీనిలో కూడా థైరాయిడ్ సమస్యను అదుపులో ఉంచే గుణాలు ఉన్నాయి. వారానికి రెండు లేదా మూడుసార్లు 50 ml కొత్తిమీర జ్యూసును తాగడం అలవాటు చేసుకోవాలి.


ఆయుర్వేదం ప్రకారం అశ్వగంధ చూర్ణాన్ని రోజు తీసుకోవడం వల్ల ఈ సమస్య అదుపులో ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి కాకుండా, అలా అని అల్పంగాను ఉత్పత్తి కాకుండా చూసుకుంటుంది. 


అల్లం టీని రోజు చేసుకొని తాగాలి. అల్లం టీలో తేనె, నిమ్మరసం మాత్రమే కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకు మీకు మార్పు కనిపిస్తుంది. 


పాలకూర
పాలకూరను ఐదు నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచి మిక్సీలో మెత్తగా జ్యూస్ గా చేయాలి. ఒక గ్లాసులోకి తీసుకొని నిమ్మరసం కలుపుకొని తాగాలి. ఇలా తాగడం వల్ల థైరాయిడ్ సమస్య తగ్గుముఖం పడుతుంది.


థైరాయిడ్ తో బాధపడుతున్న వారు ఎక్కువగా చేపలను తినాలి. చేపలను ఉడికించి మాత్రమే తింటే మంచిది. నూనెలో వేయించి తినడం వల్ల ఫలితం ఉండదు. కాబట్టి కూరలా వండుకొని తింటే మంచిది.


దాల్చిన చెక్క టీను రోజు తాగితే మంచి ఫలితాలు ఉంటాయి.


రోజుకో క్యారెట్‌ను తినడం అలవాటు చేసుకుంటే థైరాయిడ్ సమస్య నియంత్రణలో ఉంటుంది. క్యారెట్‌ని జ్యూస్‌గా తాగినా మంచిదే.


ఉసిరికాయ పొడిని లేదా జ్యూస్ ఆహారంలో భాగంగా తీసుకుంటే థైరాయిడ్ అదుపులో ఉంచుకోవచ్చు. 



Also read: మీకు డయాబెటిస్ ఉందా? శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ కిడ్నీలు ప్రమాదంలో పడినట్టే














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.