ఆలూగడ్డలు లేనిదే చాలా మంది భోజనం పూర్తికాదు. బంగాళాదుంపల వేపుడు, కూర, పూరీ కూర, చిప్స్, వెడ్జ్‌స్, వెజ్ నగ్గెట్స్, బర్గర్లు... ఇలా ఎన్నో రకాల వంటల్లో వీటి వాడకం అధికం.ఇవి లేనిదే ఆహారప్రపంచంలో ఎన్నో రుచులు మిస్ అవుతాం. అయితే ప్రతిసారి బంగాళాదుంపలు వండేటప్పుడు పైన పొట్టు తీసేస్తారు. తొక్కతో వండడానికి ఇష్టపడరు.కానీ ఆహారనిపుణులు చెప్పిన దాని ప్రకారం తొక్కని తీసేయడం వల్ల చాలా పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. అందుకే బంగాళాదుంపలను పొట్టుతో వండుకుని తినాలని 
సూచిస్తారు. 


ఆయుర్ధాయం పెరుగుతుంది
మనం అంటే పొట్టు తీసి తింటాం కానీ, ఈక్వెడార్, రష్యా, బల్గేరియా వంటి చాలా దేశాల్లో తొక్కతోనే తింటారు. ఇలా తొక్కతో తినడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని వారి నమ్మకం. ఆయుష్షుు పెరిగేందుకు, కలకాలం ఆరోగ్యంగా బతికేందుకు ఆ పొట్టులోని సమ్మేళనాలు,పోషకాలు సహకరిస్తాయని అనుకుంటారు. అందుకే వీరి వంటకాల్లో ప్రధానమైనది పొట్టుతో కూడిన ఆలూ దుంపలే.


ఎంతో ఆరోగ్యం..
బంగాళాదుంపల కన్నా వాటి పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. క్యారెట్లలో ఉన్న విటమిన్ ఎ కన్నా ఈ పొట్టులో ఉంటే విటమిన్ ఎ శాతమే అధికం.కండి చూపును మెరుగుపరిచేందుకు ఇది సహాయపడుతుంది. కంటి శుక్లాలు కూడా రాకుండా అడ్డకుంటాయి. విటమిన్ సి, బి కూడా తొక్కలో ఉంటాయి. కాబట్టి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వ్యాధులు త్వరగా రాకుండా జాగ్రత్త పడచ్చు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కనుక బరువు కూడా తగ్గచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు త్వరగా రావు. 


తక్కువ తింటే ఏం కాదు?
బంగాళాదుంపల తొక్కల్లో సొలనైన్ అనబడే విషపదార్థం ఉంటుంది. ఇది చాలా సూక్ష్మపరిమాణంలో ఉంటుంది. మనం తినే నాలుగైదు బంగాళాదుంపల తొక్కల్లోని సొలనైన్ మనల్ని ఏమీ చేయలేదు. దాదాపు 15 కిలోల పొట్టు తింటే అప్పుడు ఆరోగ్యసమస్యలు మొదలవ్వవచ్చు. 


బంగాళాదుంప పొట్టులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా ఈసారి తొక్కతోనే వాటిని తినండి.అయితే ఆ దుంపలు భూమిలో పెరుగుతాయి కనుక మట్టి పట్టి ఉంటాయి. బాగా శుభ్రం చేశాక వండుకోవాలి. 



గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.



Also read: కౌగిలించుకుంటే ఎంత ఆరోగ్యమో, తెలిస్తే రోజూ కౌగిలింతలే


Also read: ఉక్రెయిన్లో ఒక నెల ఖర్చు ఎంత తక్కువో తెలుసా? మనం హ్యాపీగా బతికేయచ్చు