తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR ) కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతోనే సమావేశం అవుతున్నారన్న విమర్శలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఈ సారి ఢిల్లీ పర్యటనలో ఆయన కాంగ్రెస్‌ పార్టీతో ( Congress Party ) సన్నిహితంగా ఉండని పార్టీల నేతలతో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలో అక్కడి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో ( Delhi CM Kejriwal ) సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేక బృందంతో ఢిల్లీకి వెళ్తున్నకేసీఆర్ మంగళవారం ఉదయం ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కానున్నారు. ధర్డ్ ఫ్రంట్ ( Third Front ) ప్రయత్నాలు ప్రారంభించిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా కేజ్రీవాల్‌తో సమావేశం అవుతున్నారు. గతంలో ఎప్పుడు ఆయనతో సమావేశం అయ్యే ప్రయత్నం చేయలేదు. 


కొన్నేళ్లుగా ఏటా తగలబడుతున్న గడ్డివాము, సీసీ కెమెరాల ఏర్పాటు - అసలు విషయం తెలిసి అవాక్కు!


బీజేపీతో పాటే కాంగ్రెస్‌నూ కేజ్రీవాల్ తీవ్రంగా విభేదిస్తారు. అయితే ఆయన బీజేపీనే ( BJP ) ప్రధాన శత్రువుగా పరిగణిస్తారు. ఇప్పుడు రాజకీయం మారింది కాబట్టి బీజేపీ మిత్రపక్షాలను కూడా కలవాలని కేసీఆర్ డిసైడయినట్లుగా కనిపిస్తోంది. అందుకే బడ్జెట్ పై చర్చల్లో  తీరిక లేకుండా ఉన్నప్పటికీ ఢిల్లీ కి వెళ్లి జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపి రావాలని డిసైడయ్యారు.  ఢిల్లీలో కేజ్రీవాల్‌తో భేటీతో పాటు మాజీ సివిల్ సర్వీస్ అధికారులతోనూ కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. కుదిరితే బీహార్ సీఎం నితీష్‌ను ( Bihar CM Nitish ) కూడా కలుస్తారని చెబుతున్నారు. బయటకు చెప్పకపోయినా కొన్ని రహస్య సమావేశాలు ఢిల్లీలో ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 


ఆర్మూర్‌లో హీటెక్కుతున్న రాజకీయాలు, MLA జీవన్ రెడ్డిపై అరవిందే బరిలో నిలిచేనా !


ఈ సారి కేసీఆర్ పర్యటన ( KCR Tour ) తర్వాత జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు ఉంటుందని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల పాటు ప్రశాంత్ కిషోర్ ( Prasant Kishore ) తెలంగాణలో పర్యటించారు. కేసీఆర్‌తో రెండు రోజులూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఓ బ్లూ ప్రింట్ చేసుకుని ఉంటారని భావిస్తున్నారు. పీకే ప్రత్యక్ష పర్యవేక్షణలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్తూండటంతో ఇతర రాజకీయ పార్టీలు కూడా కేసీఆర్ టూర్‌పై ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి.  ఢిల్లీ పర్యటన తర్వాత కేసీఆర్ మమతా బెనర్జీతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.