కౌగిలింత అంటే కేవలం ప్రేమికులకో, భార్యాభర్తలకో సంభంధించినది కాదు. అదొక ప్రేమ వ్యక్తీకరణ. తల్లి బిడ్డపై, కొడుకు తండ్రిపై, తాత మనవరాలిపై ఇలా ఎప్పుడైనా కౌగిలించుకుని ప్రేమను చెప్పొచ్చు.బాధలో ఉన్నవారిని కౌగిలించుకుంటే వారికి కాస్త సాంత్వనగా అనిపిస్తుంది. అందుకే కౌగిలింత చాలా పవర్‌ఫుల్ అనే చెప్పాలి. కౌగిలింత వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. 


మూడ్ చురుకుగా...
మీ మూడ్ బాగోలేనప్పుడు మీకిష్టమైన వ్యక్తిని కౌగలించుకోండి. మీకే మార్పు కనిపిస్తుంది. అకస్మాత్తుగా ఆనందం కలుగుతుంది. హగ్ చేసుకోవడం వల్ల డోపమైన్, సెరోటోనిన్ వంటి హర్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఆనందభావనను పెంచుతాయి. తద్వారా ఉల్లాసంగా మారతారు. 


గుండెకు మంచిది
కౌగిలింతలు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచడం ద్వారా హైపర్ టెన్షన్‌ నియంత్రిస్తుంది హగ్.  తద్వారా గుండెను కాపాడుతుంది. ఇప్పటికే చాలా అధ్యయనాలు ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. 


రోగనిరోధక శక్తిని పెంచుతుంది
రోజూ కౌగిలించుకునే వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పటికే కొన్ని అధ్యయనాలు ఈ విషయాన్ని తేల్చిచెప్పాయి. కొన్ని రకాల రోగాలు రాకుండా హగ్స్ అడ్డుకుంటాయి. అందుకే మీ పిల్లలను రోజూ కౌగిలించుకోండి వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 


ఒత్తిడిని అరికట్టేలా...
ఒత్తిడిగా ఉన్నప్పుడు ఆలోచనలు గజిబిజిగా ఉంటాయి. మనస్సు అస్తవ్యస్తంగా ఉంటుంది. అలాంటి సమయంలో మనసుకు నచ్చినవారికి గట్టిగా కౌగిలించుకుని చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. హగ్ చేసుకోగానే హ్యాపీ హార్మోన్ విడుదలై ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తుంది. 


నొప్పి తగ్గిస్తుంది
కౌగిలింతలు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.కౌగిలించుకున్నప్పుడు గట్టిగా హత్తుకుంటే కండరాలలోని ఒత్తిడి బయటికి పోతుంది. అప్పుడు శరీరం తేలికగా అనిపిస్తుంది. శరీరానికి విశ్రాంతిగా ఉంటుంది. కౌగిలింగకు హీలింగ్ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. 


కౌగిలింత మనో ధైర్యాన్ని నింపడంలో కూడా ముందుంటుంది. మీకు నేనున్నాననే భావన ఎదుటివారిలో కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మానసికంగా బలంగా ఉండే వాళ్లు శారీరకంగా కూడా బలంగా ఉంటారు. 



గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.



Also read: ఉక్రెయిన్లో ఒక నెల ఖర్చు ఎంత తక్కువో తెలుసా? మనం హ్యాపీగా బతికేయచ్చు


Also read: ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ కిటికీ తుడిచిన సూపర్ ఉమెన్, వైరల్ అవుతున్న వీడియో