కరోనా సంక్షోభం నుంచి భారత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కానీ చమురు ధరలు, వంట గ్యాస్, సీఎన్‌జీ, టోల్ ట్యాక్స్‌లు ఇలా ప్రతి దానిపై ధరలు భారీగా పెరుగతున్నాయి. దీంతో సామాన్యుడి వీపు విమానం మోత మోగుతోంది. ఇవే అనుకుంటే తాజాగా మరో షాకింగ్ విషయం తెలిసింది. అత్యవసరమైన దాదాపు 800 మెడిసిన్ల రేట్లు కూడా ఏప్రిల్ నుంచి పెరిగిపోతాయట.
లిస్ట్ ఇదే
ధరలు పెరిగే ట్యాబ్లెట్ల జాబితాలో పెయిన్ కిల్లర్లు, యాంటిబయోటిక్స్, యాంటి ఇన్‌ఫెక్టివ్స్ ఇలా నిత్యం ఉపయోగించేవే ఎక్కువ ఉన్నాయని సమాచారం. ఈ డ్రగ్స్‌పై 10 శాతం వరకు ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతించిందట.
ప్రస్తుతం అండర్ ప్రైస్ కంట్రోల్‌లో ఉన్న ఈ షెడ్యూల్డ్ డ్రగ్స్‌పై 10.7 శాతం ధరలు పెంచుకునేందుకు 'ద నేషనల్ ఫార్మాసుటికల్ ప్రైసింగ్ అథారిటీ '(NPPA), 'ఇండియా డ్రగ్ ప్రైసింగ్ అథారిటీ' అనుమతులు ఇచ్చాయి. ఇప్పటివరకు ఒకేసారి ఇంత మొత్తంలో ధరలు పెంచడం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 1 నుంచి ఈ ధరలు అమలులోకి రానున్నాయి.
పారాసెటమాల్
జ్వరం, ఇన్‌ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, అధిక రక్తపోటు, చర్మవ్యాధులు, అనీమియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే అత్యవసర ఔషధాల ధరలన్నీ వచ్చే నెల నుంచి పెరగనున్నాయి.
ఇందులో పారాసెటమాల్, ఫెనోబార్బిటోన్, ఫెనిటోయిన్ సోడియం, అజిత్రోమైసిన్, సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, మెట్రోనిడజోల్ వంటి మందులు ఉన్నాయి.
విటమిన్స్, మినరల్స్ ధరలు కూడా పెరగనున్నాయి. వీటిలో చాలా ఔషధాలు కొవిడ్ బాధితుల చికిత్సలోనూ ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందిన సమయంలో చాలా మంది పారాసెటమాల్ ట్యాబ్లెట్లను ఇంట్లో స్టాక్ పెట్టుకునేవాళ్లు. దీని వల్ల ఆ ట్యాబ్లెట్ల కృత్రిమ కొరత కూడా ఏర్పడింది. ఏప్రిల్ 1 నుంచి ఇలాంటి నిత్యవసర ట్యాబ్లెట్ల రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Also Read: Rajya Sabha Elections 2022: 6 రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఒకే రోజు పోలింగ్