2015 సివిల్స్ ఫలితాల్లో టీనా దాబి నెంబర్ వన్‌గా నిలిచారు. ఆమె మొదటి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. రండో ర్యాంక్‌కు జమ్మూ కశ్మీర్‌కు చెందిన అమీర్ ఖాన్ పొందారు. వీరిద్దరిదీ స్ఫూర్తిదాయక కథే. కొన్నాళ్లకు వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డ విషయం బయటకు వచ్చింది. చూడచక్కనైన జంట కావడం... మతాంతర వివాహం కావడంతో దేశవ్యాప్తంగా మంచి ప్రచారం వచ్చింది. వీరి పెళ్లికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అప్పటి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. అప్పట్లో వీరి పెళ్లిని లవ్ జీహాద్‌గా విమర్శించిన వారు కూడా ఉన్నారు. అయితే వారు ఎక్కువ కాలం కలసి ఉండలేకపోయారు. మత ఆచారాలు.. ఇతర కట్టుబాట్ల వల్ల ఇరువురి మధ్య తేడాలు వచ్చాయి. దాంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. రెండు నెలల కిందటే విడాకులు తీసుకున్నారు. విడాకుల విషయం కూడా సంచలనం అయింది. ట్రెండింగ్‌లో నిలిచింది. 










రెండు నెలల్లోనే టీనా దాబి రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాండేతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసుకున్నారు. 


 






టీనా దాబి ప్రస్తుతం రాజస్తాన్‌ కేడర్‌లో ఉన్నారు. ప్రదీప్ గవాండే కూడా రాజస్థాన్‌ క్యాడరే. దీంతో వారిద్దరి మధ్య చిగురించిన స్నేహం పెళ్లి వరకూ వెళ్తోంది. ప్రదీప్ గవాండేకు కూడా రెండో పెళ్లే. ఆయన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. తాము ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లుగా ఆయన కూడా ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. 







వచ్చే నెల 22న ఈ జంట జైపూర్‌లో నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటారు. టీనా దాబికి సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు మిలియన్ల కొద్ది ఫాలోయర్స్ ఉన్నారు.