మానవశ్వాసనాళంలో ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్, వైల్డ్ స్ట్రెయిన్ కన్నా 70 రేట్లు వేగంగా సోకుతుందని అధ్యయనంలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్ (HKUMed)లోని LKS ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ఈ అధ్యయనాన్ని ఇంకా సమీక్షించలేదని తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వేరియంట్ ఆఫ్ కన్సర్న్ (VOC)గా గుర్తించిన ఓమిక్రాన్ వేరియంట్ మానవ శ్వాసకోశానికి ఎలా సోకుతుందనే దానిపై హాంకాంగ్ విశ్వవిద్యాలయం ముందుగా అధ్యయనం చేసింది. 


Also Read: ఒమిక్రాన్‌పై మన వ్యాక్సిన్లు పనిచేస్తాయా? WHO షాకింగ్ న్యూస్!


వైరస్ సంక్రమణపై పరిశోధన 


ఈ అధ్యయనంలో ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్, ఒరిజినల్ SARS-CoV-2 వైరస్ కన్నా వేగంగా మానవశ్వాసనాళంలోకి చేరుతోంది. కానీ ఊపిరితిత్తులలోని ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ వైల్డ్ స్ట్రెయిన్ కంటే చాలా తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఇది తక్కువ వ్యాధి తీవ్రతకు సూచికకావచ్చని శాస్ర్తవేత్తలు తెలిపారు. వైరస్ ఇన్‌ఫెక్షన్‌లను పరిశోధించడానికి శ్వాసకోశ ఎక్స్‌వివోలను 2007 నుంచి పరిశోధకులు ఉపయోగిస్తున్నారు. ఎక్స్ వివో వైద్య ప్రక్రియలో భాగం, దీనిలో ఒక అవయవం, కణం లేదా కణజాలం జీవి నుంచి తీసుకుంటారు. ప్రయోగం కోసం సజీవ శరీరానికి తిరిగి ఎక్కిస్తారు. ఇతర SARS-CoV-2 వేరియంట్‌ల వ్యాధి తీవ్రతలో ఒమిక్రాన్ వేరియంట్ ఎందుకు భిన్నంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి పరిశోధకలు ఈ సాంకేతికతను ఉపయోగించారు. ప్రయోగాత్మక నమూనాను ఉపయోగించి కోవిడ్-19 వైరస్ వైల్డ్ స్ట్రెయిన్, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్‌ల వల్ల మానవ శ్వాసనాళంలో సంభవించే ఇన్‌ఫెక్షన్‌ను పోల్చారు. 


Also Read: భారత్‌ పంజా దెబ్బకు పాక్ పరార్.. విజయ్ దివస్.. ఇది కథ కాదు విజయగాథ!


వ్యాధి తీవ్రత తక్కువే కానీ 


ఈ ప్రయోగం ప్రారంభించిన 24 గంటల తర్వాత డెల్టా వేరియంట్, ఒరిజినల్ స్ట్రెయిన్ కంటే 70 రెట్లు అధిక రేటుతో ఒమిక్రాన్ వేరియంట్ స్పందించడం గమనించారు. అయినప్పటికీ మానవ ఊపిరితిత్తుల కణజాలంలో ఒమిక్రాన్ రూపాంతరం అసలు SARS-CoV-2 వైరస్ కంటే తక్కువ సమర్ధవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఊపిరితిత్తుల కణజాలంలో ఒమిక్రాన్ రెప్లికేషన్ రేటు వైల్డ్ స్ట్రెయిన్ రేటుతో పోలిస్తే 10 రెట్లు తక్కువగా ఉందని, వ్యాధి తక్కువ తీవ్రతను సూచిస్తుంనదని ఓ ప్రకటన పేర్కొన్నారు. అధ్యయన బృందంలో కీలక వ్యక్తి డాక్టర్ మైఖేల్ చాన్ చి-వైని ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మానవులలో వ్యాధి తీవ్రత వైరస్ రెప్లికేషన్ ద్వారా మాత్రమే కాకుండా సంక్రమణకు హోస్ట్ ప్రతిస్పందన ద్వారా కూడా నిర్ణయించవచ్చని తెలిపారు. వైరస్ తక్కువ వ్యాధికారకమైనప్పటికీ చాలా అంటువ్యాధి వైరస్ అని, ఎక్కువ మందికి సోకడం ద్వారా మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ టీకాల నుంచి రోగనిరోధక శక్తిని పాక్షికంగా తప్పించుకోగలదని ఇటీవలి అధ్యయనాల్లో తెలుస్తోంది. 


Also Read: అమ్మాయి పెళ్లి వయసు 18 కాదు 21 ఏళ్లు.. త్వరలోనే పార్లమెంట్‌లో చట్టం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి