బరువు తగ్గాలనుకునేవాళ్లు ఉదయం అల్పాహారం మానేయడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు, డైటీషియన్లు చెబుతుంటారు. అలాగని ఎలా అంటే అలా తినడం కాకుండా క్రమ పద్ధతిలో సరైన ఆహారం తీసుకుంటే మనం కోరుకున్న శరీరాకృతి  సొంతమవుతుంది.




పరగడపున తినాల్సినవి


బాదం


పరగడపున తినడానికి బాదం చాలామంచిది. ఆరోగ్యానికి కాలవలసిన పోషకాహారం పుష్కలంగా డ్రై ఫ్రూట్స్‌లో ఉంటాయి. ముఖ్యంగా బాదంలో ఖనిజలవణాలు, విటమిన్లు, ఎంజైములు స్రవించడానికి అవసరమైన వనరులు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంచి శుద్ధి చేస్తాయి. సహజంగా తీసుకునే ఆహారం ద్వారా వచ్చేఅనారోగ్యాలకు కూడా బాదం మందులా ఉపయోగపడతాయి. ఇంకా ఈ బాదం పప్పులను తినడానికి ముందు నీళ్ళలో నానబెట్టడం ద్వారా చాలా టేస్టీగా ఉండటమే కాదు, ఈజీగా జీర్ణం అవుతాయి.అనేక ప్రయోజనాలను అందిస్తాయి.


సిట్రస్ ఫ్రూట్స్


జీర్ణశక్తిని పెంచడంలో, ఎనర్జీలెవల్స్ , ఆకలిని పెంచడంలో లెమన్ వాటర్ సహాయపడుతుంది. పుచ్చకాయ, బొప్పాయి, జామ, మామిడి, దానిమ్మ పండ్లను పరగడపున తినొచ్చు. బొప్పాయిలో పెపైన్ అనే ఎజైమ్ అధికంగా ఉండటం వల్ల ఇన్ఫ్లమేషన్ , థ్రోట్ ఇన్ఫెక్షన్, తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది, ప్యారాసైటిక్ వార్మ్ మీద దాడిచేస్తాయి. ఇంకా, ఇందులో ఉండే హైఫైబర్ కంటెంట్ ప్రేగుల్లోనే వేస్ట్ ను తొలగించి, డైజెస్టివ్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఈ ఫ్రూట్ బ్లడ్ షుగర్ లెవల్ ను కంట్రోల్ చేయడంలో, బ్లడ్ ప్రెజర్, తగ్గించడంలో, హార్ట్ హెల్త్ మెరుగుపరచడంలో  సహాయపడుతుంది.


బక్ వీట్


బక్ వీట్ లో విటమిన్ బి6, ప్యాంటోథెనిక్ , నియాసిన్, ఫొల్లెట్, థూమిన్, కోలిన్, రెసిస్టెంట్ ఫైబర్ అధికంగా ఉన్నాయి. బరువు తగ్గించడానికి, ఆకలి తగ్గించడానికి డయాబెటిస్ ను మెరుగుపరచడానికి సహాయపడతాయి.


తృణ ధాన్యాలు


బియ్యం, క్వీనా, అమర్నాథ్, మిల్లెట్,  స్ప్లెట్ లో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉంటాయి. ఇంకా వాటిలో ఉండే ఫైబర్, ప్రోటీన్స్ రెగ్యులర్ బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తాయి. హార్ట్ అటాక్, టైప్ 2 డయాబెటిస్, ఓబేసిటి, క్యాన్సర్ లక్షణాలను నివారిస్తాయి.




పెరుగు
పెరుగు పెరుగులో ప్రోటీన్స్, అధికంగా ఉండటం వల్ల ఇవి కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.దీర్ఘకాలిక ఎనర్జీని అందిస్తాయి. ఫ్యాట్ , ప్రోటీన్ లెవల్స్ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సమయం పొట్ట నిండుగా అనిపిస్తుంది. జీర్ణశక్తిని పెంచి , వ్యాధినిరోధకతను మెరుగుపరుస్తుంది. పెరుగులో కొద్దిగా తేనె, కొన్ని నట్స్, సీడ్స్ మిక్స్ చేసి , ఫ్రూట్స్ కలిపి పరగడపున తినొచ్చు.
చియా విత్తనాలు


సూపర్ ఫుడ్ అనే పదం చియా విత్తనాలకుసరిగ్గా సరిపోతుంది. మెక్సికోలో ఉద్భవించిన ఈ విత్తనాల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. కేవలం ఒక టీస్పూన్ గింజలు రాత్రంతా నానబెట్టి పరగడపునే తింటే బరువు కూడా తగ్గుతారట.


ఖర్జూరం


పిల్లలకు ఖర్జూరపండు రోజు ఉదయం పరగడపున ఇవ్వడం వలన మెదడు చురుగ్గా పని చేస్తుంది. నైట్ అంతా నిద్రపోవడం వల్ల ఒంట్లొ చక్కర శాతం తగ్గి లేస్తూనే నీరసంగా ఉంటారు. పరగడపున ఖర్జూరం తినడం వల్ల ఫుల్ హుషారుగా ఉంటారు. ఉదర సంబందం క్యాన్సర్లను నయం చేసే శక్తి ఖర్జూరాల్లో ఉంది. పక్షవాతం రాకుండా చెయడంలో చాలా తోడ్పడుతాయి. రక్తహీనతతొ బాధపడేవారికి ఖర్జూరాలు చాలా మంచి ఆహారం


గుడ్లు


గుడ్లలో ప్రోటీన్లు మరియు కొలెస్ట్రాల్ ఎక్కువ. పొట్ట నిండుగా ఉంచడానికి ఇది పర్ఫెక్ట్ ఫుడ్ . ఉదయం ఎనర్జీ అందివ్వడానికి ఇది బెస్ట్ ఫుడ్.




పుచ్చకాయలు


వాటర్ మెలోన్ హైడ్రేటింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్, అమినోయాసిడ్స్ కూడా అధికంగా ఉన్నాయి. ఇవి వ్యాయామం తర్వాత మంచి ఎనర్జీని ఇస్తాయి. కణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్, డయాబెటిస్, మాస్కులర్ డిసీజ్, కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ ను నివారిస్తుంది.


పరగడపున తీసుకోకూడనివి


ఫ్రూట్ జ్యూస్ లు


గ్రాసరీ స్టోర్స్ లో ఉండే దాదాపు అన్ని రకాల ఫ్రూట్ జ్యూసుల్లో షుగర్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, కలరింగ్, మరియు ప్రిజర్వేటివ్ ఉన్నాయి. కొన్నింటిలో షుగర్స్ కంటే సోడా ఎక్కువగా ఉంటుంది!ఈ జ్యూస్ లు బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతాయి. ఫ్రూట్ జూసులకు బదులుగా ఫ్రెష్ ఫ్రూట్స్, విటమిన్స్, మినిరల్స్, మరియు ఫైబర్ వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి ఎక్సెస్ షుగర్స్ చేరకుండా నివారించుకోవచ్చు.


టమోటాలు


అసిడిక్ రిఫ్లెక్షన్, అల్సర్ తో బాధతున్నట్లైతే పరగడపునే టమోటాలు తీసుకోరాదు. టమోటోలను బ్రేక్ ఫాస్ట్, సలాడ్స్, సైడ్ డిష్ లలో ఉపయోగించుకోవడం మంచిది. దీన్ని బ్రెడ్, ఫ్రెష్ సాల్సా, స్క్రాబుల్డ్ ఎగ్స్ తో పాటు తీసుకోవచ్చు.






శీతల పానీయాలు


పెప్సీ, కోకాకోలా వంటి శీతల పానీయాలు మరియు చక్కెర కలిపిన కార్బోనేటేడ్ పానీయాలు ఉదయం వేళల్లో దూరంగా ఉండాలి. కేలరీలు అధికంగా ఉండటమే కాకుండా, ఇవి కడుపు ఉబ్బరం మరియు కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి,


కాఫీ లేదా టీ


కాఫీ-టీ నిద్రమేల్కోలా చేస్తుంది. అయితే కాఫీ అంత మంచిది కాదు,ఇది డ్యూరియాటిక్ గా అంటే శరీరంలోని నీటిశాతంను తగ్గించే విధంగా చేస్తుంది. డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. కెఫిన్ యాక్సైటి పెంచుతుంది. కాఫీ అసిడిక్ , అసిడిక్ రిఫ్లెక్షన్ కు కారణం అవుతుంది, ఇతర జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. కాఫీ-టీలు కంప్లీట్ గా మానేయాల్సినవసరం లేదు కానీ, మంచి అల్పాహారాన్ని తీసుకున్న తర్వాత తీసుకోవచ్చు.

షుగర్ సెరల్స్


చాలా వరకూ స్వీట్స్ డెసర్ట్స్ ను చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీటిలో గోధుమలతో తయారుచేసిన వాటిలో విటమిన్స్, మినిరల్స్, ఆర్టిఫిషియల్ స్వీట్స్ , కలర్స్ , ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కలిపి ఉంటారు ఇంటువంటి ఆహారాలు బ్లడ్ షుగర్స్ ను వేగంగా పెంచుతాయి, దాంతో ఎనర్జీని తగ్గించేస్తాయి, ఇన్సులిన్ సెన్సిటివిటి మీద ప్రభావం చూపుతాయి.