రాజ్యసభ  నిరవధిక వాయిదా పడక ముందు రాజ్యసభలో జరిగిన పరిణామాలపై  ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ సభలోనే కన్నీరు పెట్టుకున్నారు. సభలో జరిగిన ఘటనలపై బయట కూడా రాజకీయ వివాదం చోటు చేసుకుంటోంది. సాగుచట్టాలపై విపక్షాలు నిరసనలు చేపట్టాయి. ప్రతిపక్ష ఎంపీలు కొందరు.. రాజ్యసభ చైర్మన్‌ స్థానం కింద పార్లమెంటరీ సిబ్బంది కూర్చునే బల్లలపైకి ఎక్కి, నల్లటి వస్త్రాలతో నిరసన తెలుపుతూ, ఫైళ్లు విసిరేసి తీవ్ర గందరగోళం సృష్టించారు.  కొందరు సభ్యులు బల్లలపై దాదాపు గంటన్నర పాటు తిష్ఠవేశారు. ఓ కాంగ్రెస్ ఎంపీ చైర్మన్‌ స్థానంపైకి ఫైల్‌ను విసిరేశారు. విపక్ష సభ్యులు తమ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  దేశ చరిత్రలో మదటి సారిగా రాజ్యసభలో సభ్యుల్ని శారీరకంగా కూడా దాడి చేశారని.. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాధీ మండిపడ్డారు. 


 దేశ ప్రజలకు మోడీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  పార్లమెంట్‌లో ఏవరేం చేశారో దేశం మొత్తం చూసిందని... ఈ ఘటనలపై బాధ్యత తీసుకుంటే.. తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా..  ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఛైర్మన్ కూడా బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరాృతం కాకూడదన్నారు. కొందరు సభ్యులు టేబుల్స్ ఎక్కి.. గర్వంగా ఫీలయ్యారని.. వారేదో గొప్ప  పని చేసినట్లుగా ట్వీట్లు చేసుకున్నారని... ఇది చాలా తప్పని ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. సభ లోపు వీడియో షూట్ చేయడం తప్పన్నారు. ప్రజలంతా ఎంపీలు తమ సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని ఎదురు చూస్తున్నారని.. కానీ ప్రతిపక్ పార్టీలు ఎజెండా ఆరాచకరం మాత్రమేనని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు.


 ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.. మొసలి కన్నీళ్లు కార్చే బదులు, వారు దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు..  మరో వైపు  ప్రభుత్వం పార్లమెంట్‌లో అప్రజాస్వామికంగా వ్యవహరించిందంటూ...  శరద్ పవార్ సహా ప్రతిపక్ష నేతలంతా ఉపరాష్ట్రపతిని కలిసి వినతిపత్రంఅందించారు.  రాజ్యసభలో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే పార్లమెంట్‌లో చర్చలు జరగకుడా చేసి.. బిల్లులను ఏకపక్షంగా పాస్ చేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గే మండిపడ్డారు. రాజ్యసభలో జరిగిన పరిణామాలు... పార్లమెంట్‌లో చీకటి రోజులుగా ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి బాధ్యత వారిదేనని అధికార పార్టీ విమర్శిస్తోంది.త మొత్తంగా రాజ్యసభలో జరిగిన పరిణామాలు మాత్రం దేశ ప్రజల్ని విస్మయ పరుస్తున్నాయి.