Human Heart: మన శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్స్ బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా, మీ గుండె పనితీరును కూడా మెరుగుపరస్తుంది. ఆరోగ్యకరమైన హృదయానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. లేదంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కొన్ని ఆహారాలు మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. అయితే మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఫుడ్స్  కూడా ఉన్నాయి. కాబట్టి గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం క్రమం తప్పకుండా తీసుకోవాలి.


విటమిన్లు, న్యూట్రీషియన్స్ కలిగిన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. జంక్ ఫుడ్ తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. అప్పుడే మీ గుండె హెల్తీగా ఉంటుంది. మనలో చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఇది మంచి అలవాటు కాదు. ఆహారం ఎక్కువ సేపు ఉండేందుకు ఫ్రిజ్ లో పెడుతుంటారు. అవి కూడా గుండె జబ్బులకు కారణమవుతాయి. కాబట్టి వాటికి బదులు ఈ ఆహారాలను తీసుకోండి.


చేపలు


గుండెకి మేలు చేసే ఆహారాల్లో ముఖ్యమైనవి చేపలు. సాల్మన్, మాకేరెల్ , సార్డినెస్ వంటి కొర్రమేను చేపలు గుండెకు మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే  ఇవి రక్తపోటును తగ్గిస్తాయి, రక్తం గడ్డకట్టడాన్ని కూడా నివారిస్తుంది.  గుండె  మంటను తగ్గించి, ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి. అంతే కాదు రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి. కాబట్టి వారానికి రెండు సార్లు అయినా సాల్మన్ చేపలతో తీసుకుంటే, మీ గుండె ఆరోగ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.


బెర్రీస్


బెర్రీస్ లో పాలీఫెనాల్స్, విటమిన్లు, ఫైబర్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే, రక్తనాళాల పనితీరును మెరుగుపరచి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేస్తాయి. కాబట్టి వారంలో మూడు సార్లు అయినా బెర్రీస్‌ను తీసుకోండి.  


ఓట్స్ 


సాధారణంగా మనలో కొంతమంది ఓట్‌లను అల్పాహారంగా తీసుకుంటారు. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బీటా-గ్లూకాన్స్ వంటి కరిగే ఫైబర్‌లలో అధికంగా ఉండే ఓట్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా  తగ్గిస్తాయి. ఈ ఫైబర్-రిచ్ సూపర్‌ఫుడ్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచి, ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడంలో కూడా ఇవి సహాయపడతాయి.


Also Read : అలోవెరా జ్యూస్​తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో.. అలా తీసుకుంటే ఇంకా మంచిదట


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.