నిద్రలో మనకు అనేక కలలు వస్తుంటాయి. అయితే, వాటిలో చాలా కలలు మనకు గుర్తుండవు. కానీ కొన్ని మాత్రం పగలు కూడా వెంటాడతాయి. కొందరికి కలలో పాములు, పులులు తదితర జంతువులు కనిపిస్తుంటాయి. అలా కనిపించడం వెనుక అనేక కారణాలు ఉంటాయని కొందరు నమ్ముతారు. స్వప్న శాస్త్రంలో వీటి గురించి స్పష్టంగా వివరించారు. అలాగే ఈజిప్ట్, గ్రీస్ వంటి పురాతన నాగరికతల్లో కూడా కలలకు విశిష్ట స్థానం ఉంది. అప్పటి ప్రజలు కలలను దైవ సంకేతంగా లేదా శక్తిగా పరిగణించేవారు. అలాగే మన పూర్వికులు కలలను దేవుడు ఇచ్చే సంకేతాలుగా భావించేవారు. ఆ కలలు మన జీవితంలో జరగబోయే మంచి చెడులను సూచిస్తాయని తెలిపేవారు. కొందరికి కలలో ఆవులు కనిపిస్తాయి. మరి, ఆవులు కలలో కనిపించడం మంచి సంకేతమేనా?
తెల్లని ఆవు కనిపిస్తే..
కలలో తెల్లని ఆవు కనిపిస్తే.. మీకు త్వరలో మంచి ఫలితాలు వస్తాయని అర్థం. ఇన్నేళ్లు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం తెల్లటి ఆవును కలలో చూడటం శుభంగా భావిస్తారు. మీరు చేయాలనుకున్న పనులను చేస్తారు. ఇది సంపద, శ్రేయస్సు , ఆనందానికి చిహ్నం.
ఆవు పాలు తాగడం
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో ఆవు పాలు తాగడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని అర్థం త్వరలో మీరు అదృష్టవంతులు అవుతారు. అలాగే విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. ఇది ఆరోగ్యం, సంపదః, జ్ఞానం పెరగడానికి సంకేతం. అప్పటి వరకు అనారోగ్య సమస్యలతో బాధ పడే వారికి ఉపశమనం లభిస్తుంది.
లేగ దూడ ..
ఆవు దూడను కలలో చూడటం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ కల మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. ఇది మీ ఆర్థిక లాభం, కెరీర్ వృద్ధికి సంకేతం. అంతే కాకుండా, విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల అతి త్వరలో నెరవేరబోతోంది.
ఆవును చంపడం..
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో ఆవును చంపడం అశుభంగా పరిగణిస్తారు. ఈ కల మీరు భవిష్యత్తులో పాపం చేస్తారని సూచిస్తుంది. మీరు జీవితంలో ఇంత వరకు చూడని కష్టాలను కూడా ఎదుర్కొంటారు.
ఆవుల మంద..
స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో ఆవుల మందను చూడటం చాలా మంచి సంకేతం. ఇది శ్రేయస్సు, సంపద , ఆనందానికి చిహ్నం. ఈ కల ఎవరికీ వస్తే వారు.. ఆర్థిక పరిస్థితులు మొత్తం మారిపోతాయి. కొన్నిసార్లు ఊహించని విధంగా మీ దగ్గరికి డబ్బు చేరుతుంది.
Also Read: మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ 3 ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉండాలి - ఉన్నాయా మరి! - చాణక్యనీతి!
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.