Aloe Vera Benefits : కొందరు రోజూ ఉదయాన్నే తమ రోటీన్​ను హెల్తీ డ్రింక్స్ లేదా హెల్తీ ఫుడ్స్​తో ప్రారంభిస్తారు. అలాంటి హెల్తీ డ్రింక్​లలో అలోవెరా జ్యూస్ కూడా ఒకటి. పెరట్లో పెంచుకోగలిగే మొక్కల్లో అలోవెరా ఒకటి. ఇది స్కిన్, హెయిర్ బెనిఫిట్స్​ మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఉదయాన్నే పరగడుపున దీనిని తాగితే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. అందుకే దీనిని రెగ్యూలర్​గా తీసుకోవాలి అంటున్నారు నిపుణులు. ఈ అలోవెరా జ్యూస్​ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


పోషకాలకు పెట్టింది పేరు..


అలోవెరా రసంలో విటమిన్లు బి, సి, ఈ, ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. కాల్షియం, కాపర్, క్రోమియం, సోడియం, సెలీనియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, జింక్ ఉంటాయి. విటమిన్ బి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ ఇ శరీరాన్ని క్యాన్సర్ కారకాల నుంచి కాపాడుతుంది. ఫోలిక్ యాసిడ్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 


బరువు తగ్గేందుకు


అలోవెరాలో యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి జీర్ణశయాంతర వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపి జీవక్రియను ప్రోత్సాహిస్తాయి. మెరుగైన జీవక్రియ కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. దీనిలోని విటమిన్ బి కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. ఆకలిని అరికడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా మీరు సరైన బరువు పొందుతారు. శరీరంలో టాక్సిన్స్​ను బయటకు పంపి.. కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. 


pH బ్యాలెన్స్  


అలోవెరా జ్యూస్ శరీరంలో pH బ్యాలెన్స్​ను నిర్వహిస్తుంది. కొన్నిసార్లు మనం తినే ఆహారం, జీవనశైలి వంటి అనేక కారణాల వల్ల శరీరంలో pH సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఆల్కలీన్​ నుంచి ఆమ్ల స్థితికి మారుతుంది. చెడు బ్యాక్టీరియా అనే అనారోగ్యాలకు దారితీసే అసిడిటీని పెంచుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కలబంద రసాన్ని తీసుకోవచ్చు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీనిని తాగితే చాలామంచిది.


హైడ్రేషన్ 


అలోవెరా జ్యూస్​లో విటమిన్లు, ఎంజైమ్​లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని హైడ్రేట్​గా ఉంచడంలో సహాయం చేస్తాయి. ఇది శరీరం నుంచి క్రమంగా మలినాలను బయటకు పంపేస్తుంది. అవయవ ఉత్పత్తిని ఆప్టిమైజ్ చేసి.. కాలేయం, మూత్రపిండాలు సరిగ్గా పని తీరు మెరుగుపరుస్తుంది. శరీరం డీ హైడ్రేట్​ కాకుండా సహాయపడుతుంది. వర్క్ అవుట్ తర్వాత జ్యూస్ తీసుకుంటే కోల్పోయిన పోషకాలు శరీరానికి తిరిగి అందుతాయి. 


కాలేయ పనితీరుకు 


కాలేయ సమస్యలు త్వరగా బయటపడవు. కాలేయం దెబ్బతింటే పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి. మలబద్ధకానికి దారి తీస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, నొప్పి, దుర్వాసన వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది. కలబంద రసంలో ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి తగిన హైడ్రేషన్, పోషణను అందిస్తుంది. తద్వార కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. 


Also Read : కాఫీ మానేస్తే శరీరంలో జరిగే మార్పులు ఇవే.. తాజా అధ్యయన ఫలితాలు చూశారా?
























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.