2025 Kia Carnival Hybrid: కియా 2025 కార్నివాల్ హైబ్రిడ్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఇది అత్యంత అధునాతన టెక్నాలజీతో రానుంది. అలాగే అత్యుత్తమ పనితీరును కూడా కనపరచనుంది. గత సంవత్సరం గ్లోబల్ మార్కెట్‌లో కొత్త తరం కార్నివాల్ విజయవంతంగా లాంచ్ అయిన తర్వాత, కియా ఇప్పుడు తన కార్నివాల్ హెచ్‌ఈవీ వేరియంట్‌ను రివీల్ చేసింది. ఒక నివేదిక ప్రకారం భారతీయ మార్కెట్లోకి ఈ కారు ఎప్పుడు రానుందో తెలియరాలేదు. అయితే కియా త్వరలో కొత్త తరం కార్నివాల్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడం మాత్రం పక్కా.


2025 కార్నివాల్ హైబ్రిడ్‌లో శక్తివంతమైన 1.6 లీటర్ టర్బో హైబ్రిడ్ ఇంజన్ ఉంది. ఇది ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి 72 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌తో కలిపి దీని పవర్ అవుట్‌పుట్ 242 బీహెచ్‌పీ కాగా, పీక్ టార్క్ 367 ఎన్ఎంగా ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ మోటార్ బలమైన టార్క్, యాక్సిలరేషన్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన ఈ ఇంజిన్ మెరుగైన పనితీరుతో పాటు మంచి మైలేజీని కూడా అందిస్తుంది.


డిజైన్ ఎలా ఉందంటే?
కొత్తగా రూపొందించిన 17 అంగుళాల చక్రాలు అద్భుతమైన ఏరోడైనమిక్స్‌తో చాలా అద్భుతంగా ఉన్నాయి. అదనంగా డ్రైవర్లు కస్టమైజ్డ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం మూడు ఆప్షనల్ మోడ్‌లతో ప్యాడిల్ షిఫ్టర్‌లను ఉపయోగించి రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను చక్కగా ట్యూన్ చేయవచ్చు. ఈ-హ్యాండ్లింగ్, ఈ-రైడ్, ఈ-ఎవేసివ్ హ్యాండ్లింగ్ అసిస్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఇది అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని, కంట్రోల్‌ను అందిస్తుంది.


2025 కార్నివాల్ హైబ్రిడ్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), ఆపరేషన్ అసిస్ట్ విత్ జంక్షన్ క్రాసింగ్ (FCA-JC), లేన్ చేంజ్ ఆన్‌కమింగ్ (FCA-LO), లేన్ చేంజ్ సైడ్ (FCA-LS) అలాగే ఎవేసివ్ కూడా ఉంటాయి. అప్‌డేట్ చేసిన సూట్ కూడా ఉంది. నావిగేషన్ బేస్డ్ స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ (N-SCC), ఇంటెలిజెంట్ స్పీడ్ లిమిట్ అసిస్ట్ (ISLA) వంటి ఫీచర్లు కూడా అందించారు. ఇవి డ్రైవర్లు, ప్రయాణీకులకు భద్రత, సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి.


కియా మోటార్స్ ఇండియా గత నెలలో తన పాపులర్ సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అధికారికంగా విడుదల చేసింది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఎంట్రీ లెవల్ హెచ్‌టీఈ వేరియంట్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షలుగా ఉంది.


మరోవైపు మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి టాటా మోటార్స్ రాబోయే సంవత్సరాలలో వివిధ విభాగాలలో అనేక కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ఈ ప్లాన్‌లో ఫేస్‌లిఫ్ట్, స్పెషల్ ఎడిషన్, కొత్త ఎస్‌యూవీ, ఈవీలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం కంపెనీ నెక్సాన్, నెక్సాన్ ఈవీ, హారియర్, సఫారీ ఎస్‌యూవీలను లాంచ్ చేసింది. ఆల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ 2024లో లాంచ్ కానుంది. 2025లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయనుంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!