వైద్య శాస్త్రం కొత్త పుంతలు తొక్కుతోవంది. మానవ ప్రాణాన్ని కాపాడేందుకు మరింత అధునాతన చికిత్సలు అమల్లోకి వచ్చాయి. బిడ్డ పుట్టక ముందే ఆ బిడ్డ ఆరోగ్య లోపాలను కనిపెట్టే ఆధునిక పరిజ్ఞానమే కాదు, ఆ సమస్యను పరిష్కరించే శస్త్రచికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి.  మన దేశ రాజధానిలోని AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తల్లి పొట్టలోనే ఉన్న గర్భస్థ శిశువుకు గుండె ఆపరేషన్ చేశారు. ఆ బిడ్డ గుండె పరిమాణం ద్రాక్ష పండ్లంతా. అంత చిన్న గుండెకు 90 సెకన్ల పాటూ అంటూ ఒకటిన్నర నిమిషం పాటూ ఆపరేషన్ చేశారు. ఆ శస్త్ర చికిత్స విజయవంతమైంది. దీంతో ప్రధాని మోడీ  AIIMS వైద్యులను మెచ్చుకున్నారు. 


గతంలో మూడుసార్లు గర్భస్రావాలకు గురైంది ఓ మహిళ. 28 ఏళ్ల వయసులో మళ్లీ గర్భం ధరించింది. కానీ గర్భస్థ శిశువు గుండె ఆరోగ్యంగా లేదని చెప్పారు వైద్యులు. అయినా ఆమె ఆ బిడ్డ తనకు కావాలని చెప్పింది. బిడ్డ బతకాలంటే గుండెకు ఆపరేషన్ చేయాలని చెప్పారు వైద్యులు. అందుకు ఆ కాబోయే తల్లి అంగీకరించింది. 


"తల్లి కడుపులో బిడ్డ ఉండగానే, కొన్ని రకాల తీవ్రమైన గుండె జబ్బులను గుర్తించవచ్చు. కొన్ని జబ్బులకు పొట్టలోనే చికిత్స చేయడం వల్ల పుట్టిన తర్వాత శిశువు ఆరోగ్యం బాగుండే అవకాశం కూడా ఉంది" అని వైద్యుల బృందం వివరించింది. కార్డియాలజీ విభాగం, కార్డియాక్ అనస్థీషియా, గైనకాలజీ వైద్యులంతా కలిపి ఈ ఆపరేషన్ విజయవంతంగా చేశారు. 


వైద్యులు చెబుతున్న ప్రకారం శిశువు గుండెకు రక్త సరఫరా సరిగా జరగడం లేదు. దీనికి రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పడింది. అల్ట్రాసౌండ్ ప్రక్రియలో తల్లి పొట్ట నుంచే సూదిని నేరుగా శిశువు గుండెలోకి గుచ్చారు వైద్యులు. తరువాత బెలూన్ కాథెటర్ ని ఉపయోగించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి అడ్డుపడిన వాల్వ్‌ను తెరిచారు. దీంతో రక్త ప్రసరణ సాధారణంగా జరుగుతోంది. శిశువు గుండె బాగా అభివృద్ధి చెందుతుందని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు వైద్యులు. ఈ ఆపరేషన్ చాలా వేగంగా చేయాలని, అందుకే తాము ఒకటిన్నర నిమిషంలో పని పూర్తి చేసినట్టు చెప్పారు. గర్భస్థ శిశువు, తల్లి ఇద్దరి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. 


నిజానికి గుండె సమస్యలు గర్భస్థ శిశువుల్లో ఉన్నట్టు గుర్తిస్తే, అబార్హన్ చేయించుకోమని సలహా ఇస్తారు వైద్యులు.  






Also read: పావురాలకు దూరంగా ఉండమని వైద్యులు ఎందుకు చెబుతున్నారు? వాటితో వచ్చే సమస్యలేంటి?











































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.