బ్రెడ్ పై మయోన్నెస్ రాసుకుని, సాండ్‌విచ్‌లా చేసుకుంటే చాలు. బ్రేక్ ఫాస్ట్ రెడీ అయినట్టే. వండక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. అందుకే ఇలాంటి రెడీమేడ్ ఆహారం చాలా పాపులర్  అయిపోయాయి. ఇవి పిల్లలకి పెద్దలకి ఇద్దరికీ ఇష్టపడే మసాలాగా మారిపోయింది. మోమోస్ వంటివి తినేందుకు కచ్చింతంగా మయెన్నెస్ ఉండాలి. లేకుంటే అవి చప్పగా అనిపిస్తాయి.  పాస్తాకు కూడా దీన్ని జోడిస్తారు. నిత్యజీవితంలో ఈ తెల్లని క్రీమ్ వాడకం ఎక్కువైపోయింది. అయితే ఇది రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదా? కాదా? అని ఎప్పుడైనా ఆలోచించారా? మయోన్నెస్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఉంది.


డయాబెటిస్
మయోనెస్ రోజు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇక డయాబెటిక్ రోగులు దీన్ని పూర్తిగా దూరం పెట్టాలి. 


అధిక బరువు 
మయోనెస్‌ను అధికంగా వినియోగిస్తే మీకు తెలియకుండానే బరువు పెరిగిపోతారు. ఈ క్రీములో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అదే సమయంలో కొవ్వు పరిమాణం కూడా అధికమే. మయోన్నెస్ అధికంగా తింటే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. బెల్లీ ఫ్యాట్ కూడా త్వరగా పెరిగిపోతుంది.


అధిక రక్తపోటు 
ఈ తెల్లని క్రీమ్ తినడం వల్ల అధిక రక్తపోటు సమస్య వచ్చే అవకాశం ఎక్కువ. మయోన్నెస్‌లో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అవసరానికి మించి ఇవి శరీరంలో చేరితే రక్తపోటు పెరుగుతుంది. మయోన్నెస్ వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 


గుండె జబ్బులు 
మయోనెస్ అధికంగా తినేవారు గుండె వ్యాధుల బారిన త్వరగా పడతారు. ఒక టేబుల్ స్పూన్ మయోన్నెస్‌లో 1.6 గ్రాముల సంతృప్త కొవ్వు ఉంటుంది. రోజూ మీరు మయోన్నెస్ తినడం వల్ల ఈ సంతృప్త కొవ్వు శరీరంలో పేరుకుపోయి కొలెస్ట్రాల్ గా మారిపోతుంది. శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుంది. 


తలనొప్పి 
మార్కెట్లో లభించే మయోన్నెస్‌లో ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ పదార్థాలు అధికంగా ఉంటాయి. దీన్ని ఎక్కువగా తినడం వల్ల తలనొప్పి, శరీరం బలహీనంగా అనిపించడం, వికారం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


మయోన్నెస్ తినడం వచ్చే ఆరోగ్యం ప్రయోజనాలు సున్నా. కేవలం ఉప్పుగా అనిపించే దాని రుచి కోసం మాత్రమే తినాలి. దాన్ని తింటే భవిష్యత్తులో వచ్చే రోగాల సంఖ్య చాలా ఎక్కువ. కాబట్టి తినకపోవడమే మంచిది. బ్రెడ్ టేస్ట్ గా అనిపించాలంటే పీనట్ బటర్ పూసుకుని తినండి. లేదా నెయ్యి రాసి రెండు కాల్చి తినండి. కానీ మయోన్నెస్ తినడం మానేయండి.


Also read: భార్యాభర్తలు విడిపోవడానికి అధిక శాతం కారణాలు ఇవే










గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.