దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 34,113 కరోనా కేసులు నమోదుకాగా 346 మంది ప్రాణాలు కోల్పోయారు. 91,930 మంది కరోనా నుంచి కోలుకున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 3.19%గా ఉంది.
- యాక్టివ్ కేసులు: 4,78,882 (1.12%)
- మొత్తం రికవరీలు: 4,16,77,641
- మొత్తం మరణాలు: 5,09,011
- మొత్తం వ్యాక్సినేషన్: 1,72,95,87,490
వ్యాక్సినేషన్
దేశంలో కొత్తగా 11,66,993 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,72,95,87,490 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
మహారాష్ట్ర
మహారాష్ట్రలో కొత్తగా 3,502 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 78,42,949కి పెరిగింది. 17 మంది కరోనాతో మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,43,404కు పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 45,905 వద్ద ఉంది.
కేరళ
కేరళలో కొవిడ్-19 కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 11,136 మందికి వైరస్ సోకింది. కరోనా కారణంగా మరో 146 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,07,383కు చేరింది. మరణాల సంఖ్య 62,199కు చేరింది.
ఆంక్షల సడలింపు
కరోనా కేసులు తగ్గుతున్న కారణంగా పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తున్నారు. జమ్ము కశ్మీర్‌లో రాత్రి కర్ఫ్యూను ఎత్తివేశారు. నేటి నుంచి దశలవారీగా విద్యాసంస్థలను ప్రారంభించారు.
రాజస్థాన్‌లో కరోనా కేసులు స్వల్పంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాజస్థాన్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఐదవ తరగతి వరకు ఫిబ్రవరి16 నుంచి పాఠశాలలు ప్రారభించనున్నట్లు పేర్కొంది ప్రభుత్వం. మరోవైపు రాష్ట్రంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్టీ- పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read: India Bans Chinese Apps: చైనాకు మరో షాక్, 54 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం ! లిస్ట్ రెడీ
Also Read: Eggs: నలభై ఏళ్లు దాటిన వారు రోజుకో గుడ్డు తినాల్సిందే అంటున్న అధ్యయనాలు